చిన్న బ్రేక్ అంటున్న ప్రభాస్
Prabhas to take a small break
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత నాలుగు నెలలుగా సినిమా షూటింగ్స్ తో చాలా బిజీగా గడపడమే కాదు వేసవి తాపాన్ని తట్టుకుంటూనే రెండు సినిమాల షూటింగ్స్ కోసం అటు ఇటు తిరుగుతూ కష్టపడుతున్నారు. ఆఖరికి ప్రభాస్ సమ్మర్ వెకేషన్ కి కూడా పోలేదు. స్పిరిట్ కోసం సందీప్ వంగ, ఫౌజీ కోసం హను రాఘవపూడి ప్రభాస్ ని బంతాట ఆడుకుంటున్నారు.
ప్రస్తుతం సందీప్ వంగ హైదరాబాద్ కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో స్పిరిట్ సినిమా షూటింగ్ ని చిత్రీకరిస్తున్నారు. హీరో ప్రభాస్ మరియు హీరోయిన్ త్రిప్తిడిమ్రి పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. స్పిరిట్ లో ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ప్రభాస్ ఒక చిన్న బ్రేక్ తీసుకోబోతున్నారట.
ఓ పది రోజుల పాటు ప్రభాస్ యూరప్ ట్రిప్ కి వెళ్ళబోతున్నారట. అక్కడే పది రోజులపాటు కాస్త రిలాక్స్ అయ్యి యూరప్ టూర్ ముగించుకుని తిరిగొచ్చిన తర్వాత, ప్రభాస్ తన పూర్తి ఫోకస్ ను ఫౌజీ సినిమాపై పెట్టనున్నట్టుగా తెలుస్తోంది.







































