జన నాయగన్ లో తొలగించాల్సిన డైలాగ్స్ అండ్ సీన్స్

Jana Nayagan censor cuts explained

 

తమిళనాడు సీఎం విజయ్ చివరి చిత్రం జన నాయగన్ ఎట్టకేలకు సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకుని విడుదలకు సిద్దమవుతుంది. జులై 24 న జన నాయగన్ విడుదలకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఆరు నెలలుగా సెన్సార్ చిక్కుల్తో వాయిదాపడిన జన నాయగన్ ఫైనల్ గా సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ తెచ్చుకుంది.

అయితే సెన్సార్ సభ్యులు జన నాయగన్ లో కొన్ని తొలగించాల్సిన సీన్స్, అలాగే డైలాగ్స్ ని సూచించగా ఆ మేరకు జన నాయగన్ లో మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

విజయ్ పెట్టిన పొలిటికల్ పార్టీ TVK కు సంబందించిన డైలాగ్స్ ని తొలగించాలి.
అలాగే అంబేడ్కర్ చట్టం అనే డైలాగ్ ని TVK చట్టంగా మార్చాలి.
ఓ పుస్తకం కవర్ పై ఉన్న అంబేడ్కర్ ఫొటోస్ మార్చాలి.
భారత జాతీయ జెండా కింద పడుతున్నట్లు ఉన్న ఒక కీలకమైన షాట్ ను పూర్తిగా తొలగించాలి.
సినిమాలో రంగనాథర్, ఓం అనే పదాలతో పాటు ఆపరేషన్ మేలుహా వివరణలో వచ్చే న్యూ ఇండియా అనే పదాన్ని మ్యూట్ చేయాలి.
ఒక చిన్నారిని తగలబెడుతున్నట్లు ఉన్న విజువల్స్ ని తొలగించి దానికి బదులుగా వేరే విజువల్స్ రీప్లేస్ చేయాలి
షీలా రాణి అనే పేరు ఎక్కడ వచ్చినా మార్చాలి.
సద్దాం హుస్సేన్ ఉరితీతకు సంబంధించిన డైలాగ్ ని కూడా మ్యూట్ చేయాలి.
అంతేకాకుండా అక్కడక్కడ కొన్ని సన్నివేశాల్లో వచ్చే పదాలను మ్యూట్ చేయాలి అని జన నాయగన్ మేకర్స్ కి సెన్సార్ కమిటీ సూచించినట్లుగా తెలుస్తుంది. 

Jana Nayagan Censor: Remove TVK, blur Ambedkar's image