లెనిన్ ఓవర్సీస్ పబ్లిక్ టాక్

Lenin Overseas Public Talk


మూడేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు గెలవాలనే సంకల్పంతో వచ్చాడు మన అక్కినేని ప్రిన్స్ అఖిల్. కసిగా కొట్టాలని హీరో అఖిల్, కొడుకుని హీరోగా నిలబెట్టాలని తండ్రి నాగార్జున, మూడు సినిమాలు డిజప్పాయింట్ చేసాయి ఈసారి గట్టి కం బ్యాక్ ఇవ్వాలని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే లు వెయిట్ చేస్తున్న చిత్రం లెనిన్. నేడు జులై 10 న ఆడియన్స్ ముందుకు వచ్చిన లెనిన్ తో అఖిల్ గెలిచాడా? ఓడాడా  ఓవర్సీస్ టాక్ చూసి తెలుసుకుందాం.

లెనిన్ కథ మొదలవడమే కాస్త నెమ్మదిగా మొదలవుతుంది. అఖిల్ నటనలో ఎంతో మెచ్యూరిటీ కనిపిస్తుంది. లెనిన్ ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా మరీ నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది.  ఎలాంటి ఎమోషన్స్ ఫస్ట్ హాఫ్ లో ఆకట్టుకోవు, కానీ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర నుంచి కథలో వేగం పుంజుకుంటుంది.

ఇంటర్వెల్ బ్లాక్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచుతుంది. సెకండ్ హాల్ఫ్ ఇంట్రెస్టింగ్ గా మొదలు కావడం, కథ ఎటువైపు వెళుతుందో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలిగించడం, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, అఖిల్ నటన, థమన్ BGM, సినిమాటోగ్రఫీ అన్ని హై లో కనిపిస్తాయి. కొన్ని సీన్స్ లో అఖిల్ నటన వేరే లెవల్, అభిమానులు మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా అఖిల్ పెరఫార్మెన్స్ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు.

లవ్ ట్రాక్ వీక్, ఫస్ట్ హాఫ్, బలమైన ఎమోషన్స్ లేకపోవడం లెనిన్ చిత్రానికి ప్రధాన మైనస్ లు. లెనిన్ ఓవరాల్ గా ఎలా ఉందొ కొద్దిసేపట్లో పూర్తి సమీక్షలో తెలుసుకుందాం.. 
 

Lenin Social Media Talk