లెనిన్ - ఉత్కంఠ తో ఒకే ఒక్కరు వెయిటింగ్

Sreeleela waiting for Lenin ResultSreeleela waiting for Lenin Result


లెనిన్ చిత్రం రిజల్ట్ కోసం ఒకే ఒక్కరు ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. అఖిల్ కి లెనిన్ హిట్ అత్యంత కీలకం. నాగార్జున అఖిల్ హిట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. మూడు సినిమాలు నిరాశపరిచే సినిమాల్తో ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కి కూడా లెనిన్ అత్యంత కీలకం కానుంది.

ఇప్పుడు లెనిన్ చిత్రం హిట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో లెనిన్ రిజల్ట్ కోసం మరొకరు అంతకన్నా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ఆమె లెనిన్ నుంచి తప్పుకున్న హీరోయిన్ శ్రీలీల. లెనిన్ సినిమా కి ముందుగా హీరోయిన్ గా శ్రీలీల ఎంపికవడమే కాదు అఖిల్ తో కొన్ని సీన్స్ లో నటించింది.

కానీ ఆమె ఆతర్వాత లెనిన్ నుంచి డేట్స్ విషయమై తప్పుకోగా.. ఆ ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోర్సే వచ్చి చేరింది. లెనిన్ చిత్రంలో భారతిగా, ప్రమోషన్స్ లో గ్లామర్ గా ఆమె మీడియాలో బాగా కనిపించింది, వినిపించింది. లెనిన్ తో భాగ్యశ్రీ బోర్సే కి మంచి పేరు రావడం ఖాయమనే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరి ఇదంతా చూసిన శ్రీలీల లెనిన్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంది కదా. లెనిన్ హిట్ అయితే శ్రీలీల ఆ సినిమా వదులుకున్నందుకు చాలా ఫీలవుతుంది. లెనిన్ రిజల్ట్ తేడా కొడితే ఆ విషయంలో సైలెంట్ గా సంతోషిస్తుంది. అందుకే లెనిన్ రిజల్ట్ కోసం ఆమె ఒక్కరే ఉత్కంఠ తో వెయిట్ చేస్తుంది. 

Lenin: Bhagyashri Borse replacing Sreeleela