సెలీనా జైట్లీ సిస్టర్ నివేదితగా పునరాగమనం
Celina Jaitly to make an acting comeback after 6 yearsనటి సెలీనా జైట్లీ సుదీర్ఘ విరామం తర్వాత కంబ్యాక్ అవుతున్నారు. ప్రముఖ సామాజిక సంస్కర్త, స్వామి వివేకానందుని ప్రధాన శిష్యురాలైన సిస్టర్ నివేదిత జీవితం ఆధారంగా రామ్ కమల్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న బయోపిక్‌లో సెలీనా ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ పాత్రను ఒక నటనగా కాకుండా గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణంగా.. తన మాతృభూమికి చేస్తున్న గౌరవపూర్వకమైన హోమ్ కమింగ్ గా సెలీనా భావిస్తున్నారు.
ఐర్లాండ్‌లో మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్‌గా జన్మించిన నివేదిత, స్వామి వివేకానందుని సిద్ధాంతాలకు ప్రభావితమై భారతీయుల అభ్యున్నతి కోసం ముఖ్యంగా మహిళా విద్య, సామాజిక సంస్కరణల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. తన చిన్నతనంలో డార్జిలింగ్‌లోని రాయ్ విల్లాను సందర్శించినప్పుడు కలిగిన అనుభూతులు ఇప్పుడీ పాత్రను పోషించే అవకాశాన్ని కల్పించాయని సెలీనా పేర్కొన్నారు. నివేదిత భారతీయురాలు కాకపోయినా?; భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మికతను తనలో భాగం చేసుకున్న తీరు తనను ఎంతో ప్రభావితం చేసిందన్నారు.
సెలీనా జైట్లీ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, నివేదిత జీవితంలోని ధైర్యసాహసాలతో పొల్చికుని ఈ పాత్ర తనకెంతో స్ఫూర్తినిస్తుందన్నారు. ఒక బాధ్యతాయుతమైన చిత్రంలో భాగస్వామి కావడమే కాకుండా తన మూలాలను తిరిగి కనుగొనే క్రమంలో ఈ ప్రాజెక్ట్ కొత్త ఉత్తేజాన్ని ఇస్తోందని భావిస్తున్నారు. ఈ చిత్రం చారిత్రక కథ మాత్రమే కాదు. మానవతా విలువలను చాటిచెప్పే గొప్ప ప్రయాణమని సెలీనా అభిప్రాయపడ్డారు.







































