King100 అప్ డేట్ అప్పటివరకు ఆగండి
Nagarjuna about King 100
కింగ్ నాగార్జున ప్రస్తుతం చిన్న కొడుకు అఖిల్ సినిమా లెనిన్ రిలీజ్ విషయంలో తలమునకలై ఉన్నారు. అఖిల్ కి లెనిన్ తో హిట్ కట్టబెట్టి తను ఫ్రీ అయ్యేలా కనిపించడమే కాదు ముందు నుంచి అనుకుంటున్నట్టుగా ఆయన నటిస్తున్న #KIng100 నుంచి కూడా ఎలాంటి అప్ డేట్ కానీ లీక్ కానీ బయటకు రాకుండా చూసుకుంటున్నారు.
లెనిన్ చిత్రం జులై 10 న విడుదల కాబోతుంది. అయితే నాగార్జున కెరీర్ లో మైలు రాయిలా నిలిచిపోయే #King100 మూవీ షూటింగ్ ఆరంభం దగ్గరనుంచి ఎలాంటి అప్ డేట్ రానివ్వడం లేదు. తాజాగా లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులు కింగ్ 100 అప్ డేట్ గురించి అడగ్గానే నాగార్జున జులై 10 తర్వాత అంటూ అభిమానులను కూల్ చేసారు.
అంటే లెనిన్ రిలీజ్ తర్వాతనే #King100 అప్ డేట్ అంటూ నాగార్జున అభిమానులకు చెప్పారు. అఖిల్ ని ఎలాగైనా లెనిన్ తో నిలబెట్టాలని నాగార్జున డిసైడ్ అయ్యారు. అన్నపూర్ణ, సితార బ్యానెర్లు లెనిన్ ని నిర్మించడమే కాదు.. నాగార్జున లెనిన్ విషయంలో ఏంతో జాగ్రత్తలు తీసుకుని జులై 10 న ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.







































