Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Is Chiranjeevi dissatisfied with the director?

ద‌ర్శ‌కుడిపై అన్న‌య్య అసంతృప్తిగానా?

Is Chiranjeevi dissatisfied with the director?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న ఫాంటసీ చిత్రం `విశ్వంభర` విడుదల పదే పదే ఆలస్యమవ తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఎన్నో రిలీజ్ తేదీలు వ‌చ్చాయి వెళ్లాయి. తాజాగా అక్టోబ‌ర్ 16న రిలీజ్ అవుతుంద‌నే కొత్త ప్ర‌చారం మొద‌లైంది. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే?  ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంపై చిరంజీవి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వినిపిస్తోంది.

ఇంత‌కాలం గ్రాఫిక్స్ ప‌నులు పూర్త‌వ్వ‌లేదంటూ తెర‌పైకి వ‌చ్చింది. కానీ తాజాగా చిరంజీవి ద‌ర్శ‌కుడి తీరుపైనా అసంతృ ప్తిగా ఉన్న‌ట్లు వినిపిస్తోంది. ఈ జాప్యానికి వశిష్ట ప్రణాళికా లోపమే ప్రధాన కారణమని అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్  , గ్రాఫిక్స్ పనులపై దర్శకుడు అంచ‌నాలు తప్పడం, షూటింగ్ ప్లానింగ్‌లో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించడంతో చిరంజీవి అసహనానికి గురైనట్లు సమాచారం.

కెరీర్‌లో ఎంతో మంది దిగ్గజ దర్శకులతో పనిచేసిన మెగాస్టార్ వ‌శిష్ట క్లైమాక్స్ ప‌నుల్లో జాప్యం చేయ‌డం స‌హా ప‌లు కార‌ణాల‌తో అన్న‌య్య అసంతృప్తిగా ఉన్న‌ట్లు వినిపిస్తోంది. సినిమా ఆలస్యమయ్యే కొద్దీ బడ్జెట్ పెరగడమే కాకుండా  తదుపరి ప్రాజెక్టుల లైన్-అప్ కూడా దెబ్బతింటుండటం చిరంజీవి భావిస్తున్నారుట‌.

ఆ గ్యాప్ ని ఫిల్ చేద్దామ‌నే బాబి సినిమాను ప‌ట్టాలెక్కించిన‌ట్లు తెలుస్తోంది. అయితే  `విశ్వంభర` కు సంబంధించి  ఇంకా చిరంజీవి పూర్తి చేయాల్సిన కొన్ని ప‌నులు పెండింగ్ లోనే ఉన్నాయ‌ట‌. వాటిని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి పూర్తిగా బాబి సినిమాపై దృష్టి మ‌ళ్లించాల‌ని బాస్ భావిస్తున్నారుట‌.

Is Chiranjeevi dissatisfied with Viswambara director?