Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Are Fauzi Makers Serious About The Release Date?

ఫౌజీ పై ఎందుకింత సైలెన్స్

Are Fauzi Makers Serious About The Release Date?

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ చిత్రం విడుదల తేదీపై చాలా సస్పెన్స్ నడుస్తుంది. ఆగస్టు నుంచి దసరా కు వెళ్లిన ఫౌజీ ఇప్పుడు డిసెంబర్ కి పోస్ట్ పోన్ అంటున్నారు. డిసెంబర్ 3 న ఫౌజీ రిలీజ్ అంటూ సోషల్ మీడియాలో డేట్ చక్కర్లు కొట్టింది.

కానీ ఫౌజీ మేకర్స్ ఇంకా ఆ తేదీపై స్పష్టత నివ్వకుండా కన్ఫ్యూజన్ లో పెట్టారు. ఫౌజీ పై మేకర్స్ ఎందుకింత సైలెన్స్ ని మైంటైన్ చేస్తున్నారో ప్రభాస్ ఫ్యాన్స్ కి అర్ధం కావడం లేదు. రాజసాబ్ మరకను ఫౌజీ చెరిపెయ్యాలని వారు చూస్తున్నారు. హను రాఘవపూడి-ప్రభాస్ నిర్విరామంగా షూటింగ్ చేస్తున్నారు.

ప్రభాస్ సమ్మర్ హాలిడేస్ కూడా తీసుకోకుండా అటు సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ ని, ఇటు హను రాఘవపూడి ఫౌజీ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. కానీ ఫౌజీ మేకర్స్ షూటింగ్ అప్ డేట్ కానీ, రిలీజ్ డేట్ కానీ ఇవ్వకుండా కామ్ గా ఉండడమే అభిమానులను ఇబ్బంది పెడుతుంది. 

Fauzi release date confusion continue