Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ranbir Kapoor Has No Entourage, Says Rajkumar Hirani

1000 కోట్ల వ‌సూళ్ల హీరోకి మేనేజ‌రే లేడా?

Ranbir Kapoor Has No Entourage, Says Rajkumar Hirani

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్  వృత్తి పట్ల చూపే నిబద్ధత.. సరళమైన వ్యక్తిత్వం గురించి దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఓ మీట్ లో ఆసక్తికర విషయాలు రివీల్ చేసారు. పరిశ్రమలో అగ్రశ్రేణి నటులకు ఉండే భారీ ఎంటౌరేజ్ హంగామాకు రణబీర్ పూర్తి భిన్నమని  పేర్కొన్నారు. `సంజు`  చిత్రీకరణ సమయంలో రణబీర్‌కు ఎలాంటి మేనేజర్.. సహాయక బృందం లేదని తన అవసరాల కోసం తానే  నేరుగా అందరితో సంప్రదింపులు జరిపేవారని హిరానీ గుర్తు చేసుకున్నారు.

రణబీర్ కపూర్ పని పట్ల చూపే అంకితభావం అసాధారణమైంద‌ని కొనియాడారు. సెట్స్‌లో ఆయన ఎవరి సహాయం కోరకుండా? అందరితో సులభంగా కలిసిపోతారని తన పనులను తానే చేసుకుంటారని తెలిపారు.  సెట్‌లోకి వచ్చే టప్పుడు తనతో పాటు చిన్నపాటి చిరుతిండ్ల పళ్ళేన్ని తీసుకొచ్చి  చుట్టూ ఉన్న వారికి కూడా పంచుతుంటారని ఇది ఆయన నిగర్వి స్వభావానికి నిదర్శనమని సహచర నటులు కూడా పేర్కొన్న సంద‌ర్భాలున్నాయి.

ప్రస్తుతం రణబీర్ కపూర్ భారీ ప్రాజెక్ట్ `రామాయణం`,  `లవ్ అండ్ వార్` చిత్రాలతో బిజీగా ఉన్నారు. స్టార్ డమ్ ఉన్నప్పటికీ ఎలాంటి హంగులకు పోకుండా పాత్రపైనే పూర్తిగా దృష్టి పెట్టే రణబీర్ వైఖరి నేటి తరం నటులకు  గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. ఆయనలో  క్రమశిక్షణే నటుడిగా ర‌ణ‌బీర్ ను  అత్యున్నత స్థానంలో నిల బెడుతోందని చెప్పొచ్చు.

Ranbir had no manager on Sanju, assistants had his contact