Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aamir Khan To Marry Gauri Spratt At His Mumbai Home

మూడో పెళ్లిని సింపుల్ గా చేసుకుంటున్న స్టార్ హీరో

Aamir Khan To Marry Gauri Spratt At His Mumbai Home

 

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని భార్యలకు విడాకులిచ్చి మూడో పెళ్ళికి సిద్ధమయ్యారు. తన స్నేహితురాలు గౌరీ ని ఆమిర్ ఈనెల 5 న వివాహం చేసుకోనున్నారు. అయితే ఈ పెళ్లి చాల సింపుల్ గా చేసుకోబోతున్నారనే వార్తలను ఆమిర్ ఖాన్ ధ్రువీకరించారు.

నిన్న గురువారం ఆమిర్ ఓ ఈవెంట్ లో తన వివాహానికి సంబందించిన పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. గౌరీ స్ప్రెట్‌ ని జులై 5 న ముంబై లోని బాంద్రా లో తన నివాసంలోనే సింపుల్ గా పెళ్లి చేసుకోబోతున్నట్టుగా, ఈ వేడుకకు కొద్దిమంది కుటుంసభ్యులు, సన్నిహితులు హాజరవుతారని, ఈ రోజు మాకు చాలా ప్రత్యేకమైనది. అందరి దీవెనలు, ఆశీస్సులు మాకు కావాలి అని తన మూడో వివాహానికి సంబందించిన ప్రకటన చేసారు.

అంతేకాకుండా ఈ పెళ్లి తర్వాత ఎలాంటి గ్రాండ్ రిసెప్షన్ కార్యక్రమాలు ప్లాన్ చేయలేదని, చాలా సింపుల్ గానే వేడుకను ముగించనున్నట్లు తెలిపారు. ఆమిర్ ఖాన్ కి 60 ఏళ్ళు.. గౌరీ తో ఆయన స్నేహం 25 ఏళ్ళు. ఈ స్నేహమే వారిద్దరూ ఒక్కటయ్యేందుకు దోహదపడింది.

Aamir Khan To Marry Gauri Spratt On July 5 At Bandra Home