ఫౌజీ vs ప్యారడైజ్

Fauzi vs Paradise


దసరా ని వదిలి చాలా సినిమాల డిసెంబర్ పై కన్నేస్తున్నాయి. ఆగష్టు లో రావాల్సిన నాని పాన్ ఇండియా ఫిలిం ది ప్యారడైజ్ డిసెంబర్ కి వెళ్లబోతుంది అనే వార్త ప్రచారంలో ఉన్నప్పటికి మేకర్స్ ఇంకా సైలెంట్ గానే ఉన్నారు. ఆగష్టు అంటే ప్రమోషన్స్ మెల్లగా స్టార్ట్ అవ్వాలి. కానీ లేదు. అందుకే ప్యారడైజ్ డిసెంబర్ కి ఫిక్స్.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫౌజీ చిత్రం దసరా కు వచ్చే ఛాన్స్ లేదు, ఫౌజీ ని డిసెంబర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారని న్యూస్ ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ప్రభాస్ ఫౌజీ, నాని ప్యారడైజ్ ఒకేసారి అంటే డిసెంబర్లో ఒకే డేట్ కి పోటీ పడితే..

అది డిసెంబర్ మొదటి వారం అయినా, లేదంటే క్రిష్ట్మస్ బరి అయినా.. రెండు పాన్ ఇండియా మూవీస్ అందులోను తెలుగులో తెరకెక్కిన క్రేజీ మూవీస్ ప్యారడైజ్, ఫౌజీ లు ఒకవేళ పోటీకి దిగితే ఆహా దిగితే బాక్సాఫీసు దగ్గర రచ్చ మాములుగా ఉండదు. మరి ఆ అవకాశం రావాలని కాదు కానీ.. వస్తే మాత్రం క్రేజీ అనే చెప్పాలి.

Prabhas vs Nani