మా ఇంటి బంగారం ఓవర్సీస్ టాక్

Maa Inti Bangaram Overseas TalkMaa Inti Bangaram Overseas Talk


టాప్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ ప్లే చేసిన మా ఇంటి బంగారం నేడు జూన్ 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్ నిడిమోరు పర్యవేక్షణలో తెరకెక్కిన మా ఇంటి బంగారం ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో ఆసక్తి కలిగించింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం ప్రీమియర్స్ ఓవర్సీస్ లో పూర్తయ్యాయి.

మా ఇంటి బంగారం ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. సినిమా స్టార్టింగ్ నుంచి ప్రీ-ఇంటర్వెల్ వరకు కథ చాలా ఫ్రెష్‌గా, సరదాగా సాగిపోతుంది, కోడలిగా సమంత లుక్స్, సమంత యాక్షన్ అన్ని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి అంటూ ఓ ఆడియెన్ కామెంట్ చేసాడు. కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం డిజప్పాయింట్ చేస్తుంది.. అంటూ ట్వీట్లు వేస్తున్నారు.

ట్విస్ట్ లు లేకుండా ఊహకి అందేలా కథనం సాగడం మైనస్, ఇంటర్వెల్ తర్వాత సినిమా ఆసక్తికరంగా ఉండాల్సింది పోయి ఫ్లాట్‌గా సాగుతుంది, అంతేకాకుండా సమంత యాక్షన్ కి సరిపోయే విలనిజం సినిమాలో కనిపించకపోవడం ప్రధాన లోపం, అలాగే యాక్షన్ సీక్వెన్స్ లో BGM డిజప్పాయింట్ చేస్తుంది.. అంటూ మరికొందరు ప్రేక్షకులు చెబుతున్న మాట.

సమంత లుక్స్, ఆమె యాక్షన్ సినిమాకి మెయిన్ హైలెట్స్, ఒక్కమాటలో చెప్పాలంటే సమంత వన్ మ్యాన్ షో అంటూ ఆడియన్స్ సోషల్ మీడియా లో మా ఇంటి బంగారాన్ని వీక్షించి కామెంట్స్ చేస్తున్నారు.

Maa Inti Bangaram Social Media Talk