సైఫ్ డాటర్ తర్వాత ఖుష్బూ కుమార్తె ఆ రేంజ్
Anandita Reveals Truth Behind Her Transformationబాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, శత్రుఘ్న సిన్హా కుమర్తె సోనాక్షి సిన్హా, భూమి ఫెడ్నేకర్ వంటి నటీమణులు కథానాయికలుగా కెరీర్ ప్రారంభించక ముందు 100 కేజీల కంటే ఎక్కువ బరువుతో ఊహించని ట్రామాను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నటి కాక ముందే వెయిల్ లాస్ జర్నీ ప్రారంభించి ఆదర్శవంతమైన ప్రయాణం, హార్డ్ వర్క్ తో తమ గోల్ ని రీచ్ అయ్యారు. ఇప్పుడు లక్షలాదిగా అభిమానులకు ఆరాధ్యదేవతలుగా హృదయాలను ఏల్తున్నారు.
ఇప్పుడు అదే బాటలో వెటరన్ నటి ఖుష్బూ సుందర్ నటవారసురాలు ఆనందిత సుందర్ కూడా తన సినిమా ప్రాయాణాన్ని ప్రారంభిచేందుకు సిద్ధమవుతున్నారు. అంతకంటే ముందే తన అధిక బరువును తగ్గించుకుని, హీరోయిన్ కావడానికి అవసరమైన అద్భుతమైన లుక్ ని సంతరించుకున్నారు. దీనివెనక నాలుగేళ్ల శ్రమ దాగి ఉందని చెబుతున్నారు ఆనందిత సుందర్. అంతేకాదు అధిక బరువు కారణంగా తాను ఎదుర్కొన్న తీవ్రమైన ఆన్ లైన్ వేధింపులు, కామెంట్ల గురించి ఆనందిత ఆవేదనగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సినీరంగంలోనే క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న ఆనందిత త్వరలోనే నటనలోకి ప్రవేశిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్, సినీ దర్శకుడు-నటుడు సుందర్ సి ల కుమార్తె ఆనందిత సుందర్ తాజాగా తనపై వస్తున్న ట్రోలింగ్‌పై స్పందించారు. సెలబ్రిటీల కుటుంబంలో పుట్టి... నిరంతరం మీడియా లైమ్‌లైట్ లో పెరగడం వల్ల చిన్నప్పటి నుండి తాను ఎదుర్కొన్న ఆన్‌లైన్ పరిశీలన, విమర్శల గురించి బహిరంగంగా మాట్లాడారు. ముఖ్యంగా గత కొంతకాలంగా తను తగ్గిన బరువుకు సంబంధించి వస్తున్న రూమర్లకు ఈ యువ క్రియేటివ్ ప్రొడ్యూసర్ చెక్ పెట్టారు.






































