ఆదర్శ కుటుంబానికి డేట్ ఫిక్స్
Aadarsha Kutumbam release date confirmed
విక్టరీ వెంకటేష్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం చిత్రం దసరా టార్గెట్ గా డేట్ ఫిక్స్ చేశారనే న్యూస్ నిజం చేసేలా ఉన్నారు. షూటింగ్ మొదలు పెట్టడం లేట్ అయినా.. త్రివిక్రమ్ చక చకా ఆదర్శ కుటుంబాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఆదర్శ కుటుంబం మొదలైన రోజే వెంకీ ఫస్ట్ లుక్ వదిలిన త్రివిక్రమ్ ఆతర్వాత ఏ అప్ డేట్ లేకుండా షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. రెండు రోజులుగా ఆదర్శ కుటుంబం ఇంటి నెం 42 చిత్రం దసరా రిలీజ్ అంటూ ప్రచారం జరగడమే కాదు.. అక్టోబర్ 2 న ఆదర్శ కుటుంబం చిత్రం విడుదల అంటూ రిలీజ్ డేట్ బయటికొచ్చెసింది.
సో వెంకీ-త్రివిక్రమ్ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆదర్శ కుటుంబం విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గ శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. నారా రోహిత్ కీ రోల్ ప్లే చేస్తుంటే నివేదా పేతురాజ్ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది.






































