ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Actress's daughter hits back hard at trolling!

ట్రోలింగ్ పై ఇచ్చిప‌డేసిన న‌టి కుమార్తె!

Actress's daughter hits back hard at trolling!

ప్రముఖ నటి ఖుష్బు సుందర్- దర్శకుడు సుందర్ సి ల కుమార్తె ఆనందిత సుందర్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో  తన శారీరక మార్పు  పై వ‌స్తోన్న  రూమర్లకు చెక్ పెట్టారు. ఆనంది అకస్మాత్తుగా బరువు తగ్గడం వెనుక సర్జరీలు.. బరువు తగ్గించే మందుల ప్రభావం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని  కొట్టిపారేశారు. ఈ మార్పు రాత్రికి రాత్రే రాలేదని.. ఆరోగ్య కారణాల దృష్ట్యా 2018 నుంచే ఫిట్‌నెస్ ప్రయాణం మొదలైందని చెప్పారు.

దాదాపు ఏడేళ్ల పాటు నిరంతరం శ్రమించడం వల్లే  బరువు తగ్గగలిగానని.. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ సమయంలో  ఎక్కువగా బయట కనిపించకపోవడం వల్లే చాలా మంది ఇది సడన్‌గా జరిగిందని భ్రమిస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా ఆన్‌లైన్ వేధింపులు, బాడీ షేమింగ్‌పై  ఆనందిత ఎంతో పరిణతితో స్పందించారు. నెటిజన్లు కొందరు తనను ట్రాన్స్‌జెండర్ అంటూ అవమానించడానికి ప్రయత్నిస్తున్నారని.. అయితే ట్రాన్స్‌జెండర్లు ఎంతో అందమైనవారని.. వారిని అవమానంగా చూడ‌టం అనేది  నెటిజన్ల అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.

సెలబ్రిటీల పిల్లలు అయినంత మాత్రాన 15 ఏళ్ల వయసు నుంచే  రూపంపై దారుణమైన కామెంట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇతరుల కోసమో? సమాజం కోసమో? కాకుండా  సొంత ఆరోగ్యం కోసమే బరువు తగ్గానని చెప్పారు. అలాగే  నెగెటివిటీని ఎదుర్కొనేలా మానసికంగా బలాన్ని పెంచుకున్నానని అన్నారు. 

Khushbu Sundar's daughter Anandita shuts down trolls