సమంత పై క్రేజా లేదంటే సింపతినా?

Samantha Maa Inti Bangaram

 

సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం ఈ జూన్ 19 శుక్రవారం విడుదల కాబోతుంది. పెద్ది హవా ముగియడంతో సమంత బంగారం పై క్రేజ్ మొదలయ్యింది. సమంత మా ఇంటి బంగారం పై క్రేజ్ చూసి ఇదంతా సమంత పై ఉన్న క్రేజా లేదంటే, ఆమెపై సింపతీనా అనే అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు.

అక్కినేని ఇంటి కోడలి స్థానాన్ని వదిలేసి, అనారోగ్యంతో సతమతమై రాజ్ నిడిమోరు ని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్న సమంత ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. ప్రస్తుతం ఆమె కమర్షియల్ ప్రాజెక్ట్స్ కి దూరంగా ఉంటుంది. అయినప్పటికీ ఆమె ఇమేజ్ ఇసుమంతైనా తగ్గలేదు అనేందుకు కారణం మా ఇంటిబగారంపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ.  

నందిని రెడ్డి దర్శకురాలు. ఆమె టాప్ డైరెక్టర్ కాదు, అలాగే మా ఇంటి బంగారంలో సమంత తప్ప స్టార్ క్యాస్ట్ లేదు. అయినప్పటికి ఆ సినిమాపై ట్రేడ్ లోను ఆడియన్స్ లోను ఆసక్తి కనిపిస్తుంది. మరి ఇదంతా ఆమెపై ప్రేమా, క్రేజా, లేదంటే సింపతినా అనేది మా ఇంటి బంగారం టాక్ పై ఆధారపడి ఉంటుంది.

Samantha Maa Inti Bangaram Release on 19th June