సూపర్ కూల్ సమంత

Samantha pramots Maa Inti BangaaramSamantha pramots Maa Inti Bangaaram

 

టాప్ హీరోయిన్ గా టాలీవుడ్, కోలీవుడ్ లో చక్రం తిప్పిన సమంత బాలీవుడ్ కి వెళ్లి వెబ్ సీరిస్ ల్లోకి అడుగుపెట్టాక సినిమాలు తగ్గించేసింది. అనారోగ్య కారణాలు, సెకండ్ మ్యారేజ్ ఇలా సమంత బిజీగా కనిపించినా నటనతో పాటుగా నిర్మాతగానూ మారింది. ట్రాలాల నిర్మాణ సంస్థలో శుభం నిర్మించిన సమంత ఇప్పుడు తానే కీలక పాత్రలో మా ఇంటి బంగారాన్ని చేసింది.

నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సమంత మా ఇంటి బంగారం చిత్రం ఈనెల 19 అంటే రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. ఈ చిత్రం కోసం సమంత సూపర్ కూల్ ఇంటర్వూస్, అలాగే బుల్లితెర షోస్ లో సినిమాని ప్రమోట్ చేస్తుంది. స్టార్ మా పరివార్ లోకి వెళ్లిన సమంత ఒక్కరోజులో 40 ఇంటర్వూస్ ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేసింది.

నందిని రెడ్డి తో కలిసి సమంత పలు వెబ్ సైట్స్ కి, ఛానల్స్ కి మా ఇంటి బంగారం పై ఇంటర్వూస్ ఇచ్చింది. అది కూడా ఒక్క రోజులో 40 ఇంటర్వూస్ తో సంచలనం సృష్టించింది. పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటూ అదిరిపోయే చీర కట్టులో సమంత అభిమానుల మనసు దోచేస్తుంది.
 

Samantha Maa Inti Bangaram