కల్కి 2 ఇప్పుడప్పుడే ఏమి చెప్పలేం
Nag Ashwin Opens Up About Kalki 2
కల్కి 2 షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కీలక పాత్రధారులు కమల్ హాసన్-అమితాబచ్చన్ లపై దర్శకుడు నాగ్ అశ్విన్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సుమతి పాత్ర నుంచి దీపికా పదుకొనె ను తప్పించారు. ఇప్పుడు ఆ పాత్రకి సాయి పల్లవిని తీసుకున్నారు అన్నారు కానీ అఫీషియల్ అనౌన్సమెంట్ లేదు.
తాజాగా నాగ్ అశ్విన్ కల్కి 2 గురించి మాట్లాడుతూ.. దీపికా పదుకొనే తప్పుకున్నారు అని కల్కి 2 లో సుమతి పాత్రను తీసెయ్యలేము, సుమతి పాత్రతోనే కదా కల్కి జన్మించేది. కల్కి తల్లి సుమతి. సో కల్కి 2 లో సుమతి పాత్ర ఉంటుంది. సుమతి పాత్రను మార్చడమనేది చాలా కష్టం. దీపికా ను ఆ రోల్ నుంచి తప్పించొచ్చు కానీ సుమతి పాత్రను తీసెయ్యలేం.
కల్కి 2 రిలీజ్ వచ్చే ఏడాది అక్టోబర్ అంటున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి డేట్స్ తీసుకోలేదు. లాంగ్ షెడ్యూల్స్ పూర్తయ్యాకే కల్కి 2 రిలీజ్ పై ఆలోచన చేస్తాం.
ఇక కల్కి 2 గురించి చెప్పడానికి ఇప్పుడప్పుడే ఏమి లేదు. ఇప్పటివరకు అయితే 2 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇంకో 2-3 నెలల్లో ఫుల్ లెంగ్త్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాం. ఇక అప్పటినుంచి కల్కి 2 నాన్ స్టాప్ గా షూటింగ్ చెయ్యాలనుకుంటున్నాం, అది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేశాం అంటూ నాగ్ అశ్విన్ కల్కి 2 పై బిగ్ అప్ డేట్ అందించారు.







































