ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Release uncertainty continues for Nikhil's Swayambhu

గప్ చుప్ గా స్వయంభు

Release uncertainty continues for Nikhil's Swayambhu

 

నిఖిల్ లేటెస్ట్ పాన్ ఇండియా ఫిలిం స్వయంభు అసలు ఈ ఏడాది రిలీజ్ అవుతుందా, నిఖిల్ బర్త్ డే కి స్వయంభు విడుదల తేదీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేసిన మేకర్స్.. ఇప్పటికి స్వయంభు విడుదల తేదీ ప్రకటించకుండా సస్పెన్స్ లో ఉంచుతున్నారు. పాన్ ఇండియా మూవీ ఇంకా విడుదల తేదీ ఇవ్వకపోవడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఆపేసారు.

ఓటీటీ డీల్ సెట్ కాకపోవడం వల్లే అన్ని సిద్ధంగా ఉన్నప్పటికీ స్వయంభు విడుదల తేదీని మేకర్స్ ప్రకటించడం లేదు. ఓటీటీ డీల్ పూర్తి కాకపోవడం వల్లే స్వయంభు విడుదల ఆగింది అనేది నిజం. నిన్నమొన్నటివరకు వార్తల్లో ఉన్న స్వయంభు ఇప్పుడు కనీసం సోషల్ మీడియాలోను కనిపించడం లేదు.

మరి నిఖిల్ కూడా స్వయంభు విషయంలో ఎందుకంత లైట్ గా వున్నాడు. స్వయంభు అనే కాదు ఇలా.. షూటింగ్ పూర్తయ్యి అన్ని రెడీ అయిన సినిమాలు కేవలం ఓటీటీ డీల్స్ అవ్వకపోవడం వల్లే థియేటర్స్ లో విడుదలయ్యేందుకు వెనుకాముందు ఆడుతున్నాయి. ప్రస్తుతం అయితే స్వయంభు మేకర్స్ గప్ చుప్ గా సైలెన్స్ ని మైంటైన్ చేస్తున్నారు. 

Why This Much Delay in Nikhil's Swayambhu?