ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Fauzi Gains Momentum, Eyes Dec Release!

ఫౌజీ టీజర్ తో షాకిస్తారా..

Fauzi Gains Momentum, Eyes Dec Release!


హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రం విడుదల దసరా కు ఉంటుందా, ఉండదా అనే అనుమానం ప్రభాస్ ఫ్యాన్స్ లో అంతకంతకు పెరిగిపోతుంది. కారణం ఫౌజీ నుంచి ఫస్ట్ లుక్ తప్ప మరొక్క అప్ డేట్ ఇవ్వని మేకర్స్ సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటున్నారు.

అసలు ఫౌజీ దసరా కు ఉంటుందో, ఉండదో కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే వచ్చే నెలలో ఫౌజీ టీజర్ ఇచ్చి దానితో సినిమాని డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటిస్తారేమో అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వస్తున్నా పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా సమయమే పడుతుంది.. అందుకే సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.

మరి నిజంగానే ఫౌజీ టీజర్ ని జులై లో వదులుతారా, అలాగే దసరా నుంచి ఫౌజీ ని పోస్ట్ పోన్ చేస్తూ డిసెంబర్ రిలీజ్ అంటారా.. ఏదో ఒకటి తేల్చి క్లారిటీ ఇస్తే ప్రభాస్ ఫ్యాన్స్ కుదురుకుంటారు. లేదంటే రాజాసాబ్ డిజాస్టర్ తో అసలే కోపంగా ఉన్న ఫ్యాన్స్ ఫౌజీ మేకర్స్ పై మండిపడడం ఖాయం. 

Prabhas’ Fauzi update