సూర్య హీరోనా.. గెస్ట్ రోల్ చేసారా
Karuppu - Suriya guest role or Hero?
కరుప్పు లో సూర్య హీరోనా.. లేదంటే బాలాజీ సినిమాలో సూర్య గెస్ట్ రోల్ ప్లే చేసారా అంటూ కరుప్పు చిత్రాన్ని ఓటీటీ లో వీక్షించిన ప్రేక్షకులు చేస్తున్న కామెంట్లు. థియేటర్స్ లో కరుప్పు/వీరభద్రుడు చిత్రం ఎలా ఆడింది. ఆర్ జె బాలాజీ ఎలివేషన్స్ తప్ప సూర్య ఎక్కడైనా కనిపించారా ఇదే ఇప్పుడు ఓటీటీ లో కరుప్పు చూసిన ప్రేక్షకుల మధ్యన జరుగుతున్న చర్చ.
సినిమా మొత్తం దర్శకుడు నటుడు ఆర్ జె బాలాజీ ఎలివేషన్స్, ఆయన సీన్స్ ఎక్కువ ఉన్నాయి. సూర్య అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా గెస్ట్ రోల్ చేసినట్టుగా వెళ్లిపోయారు. అసలు బాలాజీ సినిమాలో సూర్య అతిధి పాత్ర చేశారనుకుంటా అంటూ దర్శకుడు బాలాజీ ని ఓటీటీ ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు.
సూర్య సీన్స్ తక్కువవ్వబట్టే సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అదే సూర్య సీన్స్ ఎక్కువ ఉంటే సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేది. ఇలాంటి సినిమాకి థియేటర్స్ లో రూ.300 కోట్ల కలెక్షన్స్ ఇచ్చారంటే నిజంగా గ్రేట్ అంటూ ఓటీటీ ఆడియన్స్ మాట్లాడుకోవడం గమనార్హం.







































