పెద్ది తర్వాత బుచ్చిబాబు దారెటు

What's Buchi Babu next movie

 

ఉప్పెన తర్వాత రెండో సినిమానే పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తో చేసిన దర్శకుడు బుచ్చి బాబు ఇప్పుడు మూడో సినిమా ని ఎవరితో చేస్తాడు. పెద్ది తర్వాత బుచ్చి బాబు దారెటు అనే విషయంలో చాలామందిలో చాలా క్యూరియాసిటీ నడుస్తుంది. రామ్ చరణ్ తో తెరకెక్కించిన పెద్ది చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వలేదు.

అలాగని సూపర్ హిట్ అని చెప్పలేము. కానీ పెద్ది రూ.350 కోట్ల క్లబ్బులోకి చేరింది. మరి ఇదేం పెద్ద ఫిగర్ కాదు. ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. అయినా లాభాలు రావడము కష్టమే. పెద్ది చిత్రంలో లోపాలున్నాయి. ముఖ్యంగా బుచ్చిబాబు పెద్ది కథను, రామ్ చరణ్ ను హ్యాండిల్ చెయ్యడంలో ఆయనకు ఎక్స్పీరియన్స్ సరిపోలేదు.

అందుకే ఆయన మూడో ప్రాజెక్ట్ కి స్టార్ హీరో దొరుకుతారా, లేదంటే మిడియం హీరోతోనే బుచ్చి బాబు మూడో సినిమాని పట్టాలెక్కిస్తాడా, అది కూడా ఎన్ని నెలలకు బుచ్చి బాబు మూడో ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంది అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 

What's Director Buchi Babu Sana next movie