ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Movies struggling with graphics and VFX issues!

గ్రాఫిక్స్ , విఎఫ్ ఎక్స్ కష్టాలతో న‌లిగిపోతున్న సినిమాలు!

Movies struggling with graphics and VFX issues!Movies struggling with graphics and VFX issues!

టాలీవుడ్‌లో సరికొత్త కథాంశాలతో.. భారీ బడ్జెట్ చిత్రాల‌ ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ తరం సినిమాలకు అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్  అత్యంత కీలకంగా మారాయి. కథను ఎంత అద్భుతంగా తెరకెక్కించినా? తెరపై ఆ విజువల్స్ పర్ఫెక్ట్‌గా రాకపోతే ప్రేక్షకులు తిరస్కరించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లుగా ఉన్న `విశ్వంభర`, `నాగబంధం`, `స్వయంభూ` వంటి భారీ చిత్రాలు గ్రాఫిక్స్ పనుల వల్లే  ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. షూటింగ్ పనులు దాదాపు ముగింపు దశకు వచ్చినా? నాణ్యమైన విఎఫ్ఎక్స్ అవుట్‌పుట్ కోసం ఈ చిత్రాల విడుదలలో జాప్యం  జరుగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న‌ సోషియో ఫాంటసీ చిత్రం `విశ్వంభర` భారీ ఊహాజనిత ప్రపంచాన్ని ఆవిష్కరిం చనుంది. అలాగే డివోషనల్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో కూడిన `నాగబంధం`, చారిత్రక పీరియడ్ నేపథ్యంలో తెర‌కెక్కిన `స్వయంభూ` చిత్రాలు కూడా విజువల్స్ పరంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా కథా పరంగా పూర్తిగా గ్రాఫిక్స్ , విఎఫ్ఎక్స్ వర్క్ పైనే ఆధారపడి ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి అవుట్‌పుట్ సాధించాలనే పట్టుదలతో మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా డిజిటల్ ల్యాబ్‌లలో  పనలు పూర్తి చేస్తున్నారు. ఈ సుదీర్ఘమైన పోస్ట్ ప్రొడక్షన్ ప్రక్రియే చిత్రాల రిలీజ్ డేట్లను వెనక్కి నెట్టేస్తోంది.

విఎఫ్ఎక్స్ ల్యాబ్‌ల నుండి అనుకున్న సమయానికి అవుట్‌పుట్ రాకపోవడం వల్ల నిర్మాతల బడ్జెట్‌లు పెరిగిపోవడమే కాకుండా థియేట్రికల్ బిజినెస్ సమీకరణాలు కూడా మారుతున్నాయి. అయినప్పటికీ తొందరపడి నాసిరకం గ్రాఫిక్స్‌తో సినిమాను థియేటర్లలోకి వదిలితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉండటంతో మేకర్స్ ఆలస్యమైనా  పక్కా క్వాలిటీతోనే రావాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ గ్రాఫిక్స్ కష్టాలు టాలీవుడ్ మేకర్స్‌కు  పెద్ద పాఠంగానూ  మారుతున్నాయి. భవిష్యత్తులో భారీ ప్రాజెక్ట్‌లు ప్లాన్ చేసేటప్పుడు కేవలం షూటింగ్ షెడ్యూల్స్ మాత్రమే కాకుండా, విఎఫ్ఎక్స్ ప్రణాళికలకు కూడా అంతే సమయాన్ని, బడ్జెట్‌ను కేటాయించాల్సిన అవసరాన్ని ఈ సినిమాలు స్పష్టం చేస్తున్నాయి.
 

Graphics and VFX issues!