జన నాయగన్ బయ్యర్లకు డబ్బు వాపస్
Vijay Asks Makers to Cancel Jana Nayagan Theatrical Deals
కోలీవుడ్ లో సీఎం విజయ్ చివరి సినిమాగా తెరకెక్కిన జన నాయగన్ ఇక విడుదల కాదా, అంటే అవుననే అనిపిస్తుంది. కారణం జన నాయగన్ చిత్ర థియేట్రికల్ రైట్స్ కొన్న బయ్యర్లకు ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జనవరిలో విడుదల కావాల్సిన జన నాయగన్ చిత్రం విడుదల నిరవధికంగా వాయిదా పడింది. దానితో బయ్యర్లు చాలావరకు నష్టపోయారు.
ఇప్పటికి జన నాయగన్ విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. అందుకే సీఎం విజయ్ జన నాయగన్ విషయంలో ఓ సంచలనం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. జన నాయగన్ కు సంబంధించిన థియేట్రికల్, నాన్-థియేట్రికల్ డీల్స్ విషయంలో విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట.
ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకోగా.. ఇప్పుడు జన నాయగన్ కు ఇప్పటివరకు జరిగిన అన్ని థియేట్రికల్ అగ్రిమెంట్లను కూడా రద్దు చేసి, డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్స్ డబ్బులను తిరిగి ఇచ్చేయాలని విజయ్ నిర్మాతలకు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇదే నిజమైతే మాత్రం అది సంచలనమే అవుతుంది.








































