పెద్ది 135 నాటౌట్
Peddi first day collections
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం పెద్ది నిన్న జూన్ 4 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన పెద్ది చిత్రానికి ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. రామ్ చరణ్ నటనకు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ సైతం నీరాజనాలు పడుతున్నారు. బుచ్చి డైరెక్షన్ అంతగా బాలేదు అన్నప్పటికీ రామ్ చరణ్ ఒంటి చేత్తో సినిమాని భుజాల మీద మోశాడు అంటూ ఆడియన్స్ చరణ్ నటనను తెగ పోగుతున్నారు.
ఇక పెద్ది మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది అన్నట్టుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ.135 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి సంచలనముగా మారింది. పెద్ది బాక్సాఫీసు ఛాంపియన్ అంటూ మేకర్స్ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు పెద్ది కొల్లగొట్టింది రూ.135.36+ కోట్ల షేర్ కలెక్షన్స్ అంటూ అఫీషియల్ గా పోస్టర్ వేసి ప్రకటించారు.
సో రామ్ చరణ్ పెద్ది ఓపెనింగ్స్ లో అద్దరగొట్టేసింది. పెద్ది చిత్రం మొదటిరోజు మాత్రమే కాదు ఈ వీకెండ్ వరకు స్ట్రాంగ్ బుకింగ్స్ తో థియేటర్స్ అన్ని ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి.







































