ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Megastar Chiru's tweet on Peddi Release

నా మనసంతా పెద్ది దగ్గరే ఉంది: చిరు

Megastar Chiru's tweet on Peddi Release


మెగాస్టార్ చిరంజీవి తనయుడు, పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం నేడు జూన్ 4 న గ్రాండ్ గా విడుదలైంది. పెద్ది చిత్ర ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. పెద్ది ప్రీమియర్స్ కి అభిమానులతో సమానంగా సినీ సెలబ్రిటీస్ థియేటర్స్ క్యూ కట్టారు. మెగా కోడలు ఉపాసన భర్త చరణ్ పెద్ది కోసం తల్లితండ్రులను తీసుకుని బాలానగర్ విమల్ థియేటర్ కి వెళ్ళింది.

అయితే మెగాస్టార్ చిరు పుత్రోత్సాహాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే చిరు హైదరాబాద్ లో లేరు. మెగా 158 షూటింగ్ నిమిత్తం పొల్లాచ్చి లో ఉన్నారు. అక్కడ దర్శకుడు బాబీ మెగా 158 ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరిస్తున్నారు. అందుకే హైదరాబాద్ లో పెద్ది సెలబ్రేషన్స్ ని ప్రత్యక్షంగా చూడలేకపోతున్నారు.

తాజాగా చిరు సోషల్ మీడియా వేదికగా పెద్దిపై వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐

నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.

గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం,  చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ అంటూ చిరు ట్వీట్ చేసారు.                    
 

Chiranjeevi's tweet on Peddi Release