తమిళనాడులో షాకిస్తున్న విజయ్ టీవీకే

తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించేలా కనిపిస్తుంది. ఇప్పటివరకు విజయ్ కింగ్ మేకర్ అవుతాడనుకుంటే కింగ్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఏప్రిల్ 23 న తమిళనాడు లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు సోమవారం వెలువడుతున్నాయి. అందులో విజయ్ టీవీకే పార్టీ తోలి రౌండ్ నుంచి ముందంజలో కనిపిస్తుంది.
స్టాలిన్ పార్టీ డీఎంకే కూడా వెనుకంజలో ఉంది. విజయ్ పార్టీ మాత్రం ముందంజలో దూసుకుపోతుంది. విజయ్ ప్రభంజనం కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుంది అనుకుంటే.. విజయ్ తమిళనాట గెలిచేలా కనిపిస్తున్నాడు. యువత మొత్తం విజయ్ వైపే నిలబడినట్లుగా ఈ ఎన్నికల ఫలితాలు కనిస్తున్నాయి.
విజయ్ టీవీకే పార్టీ గెలిస్తే తమిళనాట కొత్త సంచలనాలకు తెర లేపినట్లే. ఒకవేళ విజయ్ గెలిస్తే.. ఆయన గెలుపుకు కారణం స్టాలిన్ ప్రభుత్వమూ, బిజెపి అంటున్నారు విశ్లేషకులు. విజయ్ 100 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. విజయ్ ని ఇబ్బంది పెట్టేందుకు జన నాయగన్ ను విడుదల కాకుండా చేయడం, బీజెపి అన్ని విధాలుగా విజయ్ ను ఇబ్బందులు పెట్టడం ఆయనకు కలిసొచ్చేలా ఉంది.
మరి ఫైనల్ గా విజయ్ తమిళనాట మ్యాజిక్ ఫిగర్ ను అందుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇది ఒక పెద్ద సంచలనం అయ్యేలా కనిపిస్తుంది. ప్రస్తుతం 100 స్థానాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో కనిపిస్తుంది.








































