విశ్వంభర ను మర్చిపోతున్నారు గురూ

అవును మెగాస్టార్ విశ్వంభరను అందరూ మర్చిపోతున్నారు. దర్శకుడు వసిష్ఠ రిలీజ్ డేట్ ఇవ్వకుండా అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. ఆగష్టు 22 న మెగాస్టార్ బర్త్ డే కూడా వచ్చేస్తుంది. మరో రెండు నెలల సమయమే ఉంది మెగాస్టార్ బర్త్ డే కి. వసిష్ఠ ఇప్పుడు విశ్వంభర రిలీజ్ తేదీ ఇచ్చినా ఈరెండు నెలలు సినిమా ప్రమోషన్స్ కు టైమ్ స్పెండ్ చెయ్యొచ్చు.
కానీ విఎఫెక్స్ పనుల వలన చిరంజీవి విశ్వంభర విషయంలో దర్శకుడు మల్లగుల్లాలు పడుతున్నాడు. చిరంజీవి మాత్రం అనిల్ రావిపూడి దర్శకుడుగా మొదలైన #Mega 157 షూటింగ్ లో బిజీ అవ్వడం, #Mega 157 అప్ డేట్స్ చూసాక మెగా ఫ్యాన్స్ కూడా విశ్వంభర ను మర్చిపోయే స్టేజ్ లో ఉన్నారు, వారి నోటి వెంట విశ్వంభర మాట కాదు #Mega 157 మాట వినబడుతుంది.
విశ్వంభర లో హీరోయిన్ గా త్రిష, అలాగే ఇంకా చాలామంది హీరోయిన్స్ అంటే ఆషిక రంగనాధన్, సురభి లాంటి హీరోయిన్స్ నటిస్తుండగా. స్పెషల్ సాంగ్ లో మరో హాట్ హీరోయిన్ కనిపించనుంది. ఏప్రిల్ లో విశ్వంభర నుంచి విడుదలైన రామరామ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది, అటు రిలీజ్ డేట్ లేక, ఇటు అప్ డేట్స్ లేక మెగా ఫ్యాన్స్ బాధ మాత్రం వర్ణనాతీతం.
Vishwambhara release date soon
Vishwambhara release date update






































