ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tollywood people are forgetting Krithi Shetty

టాలీవుడ్ జనాలు మరిచిపోతున్నారు బేబమ్మా

Tollywood people are forgetting Krithi Shetty

ఉప్పెన బ్యూటీ బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేసిన కృతి శెట్టి ని ఇప్పుడు ఆదరించిన తెలుగు ప్రేక్షకులే మరిచిపోయే పరిస్థితి వచ్చేసింది. కారణం కృతి శెట్టి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించక చాలా కాలమైంది, అమ్మడిని పట్టించుకునే టాలీవుడ్ హీరో ఎవరూ కనిపించడం లేదు. 

సోషల్ మీడియాలో కృతి శెట్టి హడావిడి తప్ప ఆమె తెలుగు ప్రాజెక్ట్స్ లో కనిపించడమే లేదు, అసలు ఆమెను కన్సిడర్ చేసిన సందర్భాలు కనిపించడం లేదు. ప్రస్తుతం తమిళనాట అదృష్టాన్ని వెతుక్కుంటున్న కృతి శెట్టి గ్లామర్ డాల్ లా సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే పని పెట్టుకుంది. 

కానీ అమ్మడిని ఎవరూ కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. తాజాగా వదిలిన కృతి శెట్టి వైట్ ఫ్రాక్ లుక్ మాత్రం నెట్టింట్లో సంచలనంగా మారింది. మరి ఈ ఫోటో షూట్స్ అమ్మడుకు అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూడాలి. 

Actress Krithi Shetty Cute Photos Viral

krithi shetty