ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Secrets Behind Kaanta Laga Girl Sudden Death

కాంట‌ల‌గా గాళ్ మృతి.. నిజం నిప్పులాంటిది!

 Secrets Behind Kaanta Laga Girl Sudden DeathSecrets Behind Kaanta Laga Girl Sudden Death

కాంట‌లగా గాళ్ షెఫాలి జ‌రివాలా మృతి వెన‌క కార‌ణాలేమిట‌న్న‌ది ఇంత‌వ‌ర‌కూ స్ప‌ష్ఠ‌త లేదు. తొలుత కొన్ని మీడియాలు ఆమె రెండో భ‌ర్త ప‌రాగ్ త్యాగి తో స‌మ‌స్య‌లు ఉండి ఉండొచ్చ‌ని, త‌న భార్య మ‌ర‌ణించాక కూడా అత‌డు సందేహాస్ప‌దంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఊహాజ‌నిత క‌థ‌నాలు ప్ర‌చురించాయి. కానీ దీనిని తేల్చాల్సింది పోలీసులు- పోస్ట్ మార్ట‌మ్ రిపోర్ట్. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వ‌చ్చే రిపోర్టులు కూడా కీల‌కం.

కానీ ఇంత‌లోనే షెఫాలి మ‌ర‌ణం స‌హ‌జ‌మ‌ర‌ణ‌మేన‌ని, త‌న‌కు వ‌య‌సు పెర‌గ‌కుండా నిరోధించే మందులు వాడే అల‌వాటు ఉండ‌టం వ‌ల్ల గుండె పోటు వ‌చ్చింద‌ని నిర్థారిస్తూ కొన్ని మీడియా సంస్థ‌లు సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారం ప్రారంభించాయి. నిజానికి దీనిని అటు ఫోరెన్సిక్ కానీ, పోస్ట్ మార్ట‌మ్ రిపోర్ట్ కానీ వెల్ల‌డించ‌లేదు. అయినా ఇది తామ‌ర‌తంప‌ర‌గా ప్ర‌చారం సాగిపోతోంది.

ఇంత‌కుముందే షెఫాలి వ్య‌క్తిగ‌త వైద్యుడు మాట్లాడుతూ.. త‌న‌కు తీవ్ర‌మైన గుండెపోటుకు గుర‌య్యే ప‌రిస్థితులు లేవ‌ని, అయితే త‌ను ఆరేళ్లుగా యాంటీ ఏజింగ్ మెడిసిన్ వాడుతున్నార‌ని బ‌హిర్గ‌తం చేసాడు. త‌ను ఎప్పుడూ ఫిట్ గా ఉండేద‌ని, అనారోగ్యాలు కూడా ఉండేవి కాద‌ని అత‌డు తెలిపాడు. అయితే అత‌డు చెప్పిన ఈ రెండు లైన్ల‌ను ప‌క్క‌కు పెట్టి, యాంటీ ఏజింగ్ మందుల వాడ‌కం వ‌ల్ల‌నే గుండెపోటు వ‌చ్చింద‌ని కొన్ని మీడియాలు ప్ర‌చారం మొద‌లు పెట్టాయి. మొత్తానికి పోలీసులు కానీ, ల్యాబ్ రిపోర్టులు కానీ రాకుండానే, ముందుగానే మీడియాలు కొన్ని ఈ డెత్ కేసు మిస్ట‌రీని ఛేధించాయి. ఈ అత్యుత్సాహం చూస్తుంటే నిజానికి న‌వ్వుకోవాలో ఏడ్వాలో తేల‌ని ప‌రిస్థితి. అస‌లు కాంట‌లగా గాళ్ మృతికి కార‌ణ‌మేమిటి? ఏది నిజం? ఏది అబ‌ద్ధం?  పోలీసులే తేల్చాలి.

Secrets Behind Kaanta Shefali Jariwala Sudden Death

shefali jariwala