ఫౌజి లో ప్రభాస్ లుక్ లీక్

Prabhas look from Fauji leakedPrabhas look from Fauji leaked

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ చిత్రంలో ఎలా ఉండబోతున్నారో అనేది దర్శకుడు మారుతి రాజా సాబ్ టీజర్ లోనే పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. ఆయన కేరెక్టర్ రాజా సాబ్ లో జోవియల్ గా ఉండబోతుంది అనే స్పష్టత వచ్చింది. ఇక హను రాఘవపూడి తో ప్రభాస్ చేస్తున్న ఫౌజీ(వర్కింగ్ టైటిల్) చిత్రంలో ప్రభాస్ ఎలా కనిపిస్తారు, ఎలాంటి లుక్ లో సర్ ప్రైజ్ చేస్తారు అనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ సోల్జర్ గా కనిపిస్తారని, దేశభక్తికి ప్రేమ కథకు దర్శకుడు హను రాఘవుడి లింక్ చేస్తున్నారనే టాక్ ఉంది. 

ప్రభాస్ ఫ్యాన్స్ ఫౌజి లో ప్రభాస్ లుక్ పై చాలా ఆత్రుత గా ఉన్న సమయంలో ఫౌజీ సెట్స్ నుంచి నుంచి ప్ర‌భాస్ కు సంబంధించిన కొన్ని పిక్స్ సోష‌ల్ మీడియాలో లీకై సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఫౌజీ సెట్ నుంచి లీకైన ఫోటోల్లో ప్ర‌భాస్ లుక్స్ మిర్చి సినిమాను పోలి ఉన్నాయ‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

మరి కొన్నాళ్లుగా లుక్ వైజ్ గా విమర్శలు ఎదుర్కుంటున్న ప్రభాస్ గతంలో మిర్చి లో కనిపించిన ఫిజిక్ అలాగే స్టయిల్ కోసం అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ ఫౌజీ లో మిర్చి స్టయిల్లో ఉండబోతున్నారనే వార్త మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈచిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

Prabhas makes style statement as Fauji

prabhas