ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Power Star praises Kamal for the Oscar Invite

క‌మ‌ల్‌పై ప‌వ‌న్ ప్ర‌శంస‌లు

Power Star praises Kamal for the Oscar InvitePower Star praises Kamal for the Oscar Invite

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌కు అకాడెమీ అవార్డ్స్ 2025 క‌మిటీలోకి ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆహ్వానం అందుకున్న క‌మ‌ల్ హాస‌న్ కు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు స‌హా అభిమానుల నుంచి శ‌భాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే సినీప్ర‌ముఖుడు, రాజ‌కీయ నాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి మ‌న‌స్ఫూర్తిగా శుభాభివంద‌నాలు అందాయి.

భార‌తీయ దిగ్గ‌జ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ను ఆస్కార్ క‌మిటీలోకి ఆహ్వానించినందుకు ముందుగా శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఆయ‌న భార‌తీయ సినిమాకు ఇంకా మ‌రెన్నో విధాలుగా సేవ‌లు చేయాల్సి ఉంద‌ని అన్నారు. క‌మ‌ల్ హాస‌న్ కేవ‌లం న‌టుడు మాత్ర‌మే కాదు.. ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం ఉన్న ప్ర‌తిభావంతుడు. న‌టుడు, క‌థ‌కుడు, ద‌ర్శ‌క‌నిర్మాత‌, గాయ‌కుడు, సంగీత‌జ్ఞుడు, చాలా ప్ర‌క్రియ‌ల్లో మేటి క‌ళాకారుడు అని ప‌వ‌న్ కీర్తించారు. ఆయ‌న ఒక క‌ళాఖండం అని కీర్తించారు. ప్ర‌పంచ సినిమాకు ఆయ‌న చేసిన సేవ‌లు అన‌న్య సామాన్య‌మైన‌వ‌ని ప్ర‌శంసించారు.  భార‌తీయ సినిమాకు ఈ క్ష‌ణం గ‌ర్వ‌కార‌ణ‌మైన‌ది అని అభినందించారు ప‌వ‌న్.  

జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు అందుకున్న క‌మల్ హాస‌న్ మూడు సార్లు నంది అవార్డుల్ని అందుకున్నారు. ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాలు ఏడు సార్లు అకాడెమీ పుర‌స్కారాల‌కు పోటీబ‌రిలోకి వెళ్లాయి. కెరీర్‌లో లెక్క‌లేన‌న్ని త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వ పుర‌స్కారాలు, ఫిలింఫేర్‌లు అందుకున్నారు. ఎన్నో అంత‌ర్జాతీయ పుర‌స్కారాల్ని క‌మ‌ల్‌హాస‌న్ అందుకున్నారు. ఇటీవ‌ల `థ‌గ్ లైఫ్`లో అద్భుత న‌ట‌ప్ర‌తిభ‌తో విశ్వ‌న‌టుడు అభిమానుల‌ను అల‌రించారు. త‌దుప‌రి `క‌ల్కి 2898 ఏడి`లో క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపాన్ని చూడాల‌ని ప్రేక్ష‌కాభిమానులు వేచి చూస్తున్నారు.

Pawan Kalyan praises Kamal Haasan

kamal haasan