పాన్ ఇండియా లో ప్రభావం చూపని కుబేర

Kuberaa box office collection reportKuberaa box office collection report

శేఖర్ కమ్ముల కుబేర రెండు తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ నమోదు చేసింది. ఇక్కడి ఆడియన్స్, సినీవిమర్శకులు అంతా కుబేర చిత్రానికి యునానమస్ సూపర్ హిట్ రివ్యూస్, సూపర్ హిట్ రెస్పాన్స్ ఇచ్చారు. తెలుగు ఆడియన్స్ కూడా హీరో ఏ భాషవాడు అని చూడలేదు, హీరో ధనుష్ అయినా సినిమాని హిట్ చేసారు. 

కానీ కోలీవుడ్ లో మాత్రం కుబేర చిత్రం డిజాస్టర్ దిశగా పయనం చేస్తుంది. తమిళనాట కుబేర ఎందుకు పూర్ పెరఫార్మెన్స్ ఇస్తుందో అనేది చూడాలి అంటూ శేఖర్ కమ్ముల మాట్లాడారు. ధనుష్ హీరోనే అయినప్పటికీ నాగార్జున కు ఎక్కువ ఇంపార్టన్స్ ఇవ్వడం శేఖర్ కమ్ముల మేకింగ్ తమిళ తంబీలకు నచ్చలేదు అనే ప్రచారం జరిగింది. 

తెలుగు లో సూపర్ హిట్ అయిన కుబేర అటు హిందీలోనూ పెద్దగా సక్సెస్ అవ్వలేదు అనేది హిందీ కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది. కుబేర ను తెలుగు ఆడియన్స్ ఆదరించినట్టుగా తమిళ, హిందీ ప్రేక్షకులు మాత్రం పట్టించుకోలేదు. ఇక్కడ 100 కోట్లు కోల్లగొట్టినా తమిళనాట మాత్రం 25 కోట్లు తెచ్చుకోవడానికి కుబేర కిందా మీదా పడుతుంది. 

ఈ లెక్కన పాన్ ఇండియా మార్కెట్ లో కుబేర సక్సెస్ కాలేదు అనే చెప్పాలి, అందుకు గల కారణాలేమిటో దర్శకుడు శేఖర్ కమ్ముల విశ్లేషించుకోవాలి.  

Kuberaa box office collection details

kuberaa