శ్రీలీలను అపార్ధం చేసుకున్నారు
The Real Reason Behind Sreeleela Stepping Out Of Leninక్యూట్ బ్యూటీ శ్రీలీలను చాలామంది అపార్ధం చేసుకున్నారు. అమ్మడు బాలీవుడ్ మోజులో పడి టాలీవుడ్ సినిమాలని పట్టింకోవడం లేదు అనుకుంటున్నారు. కారణం ఆమె అఖిల్ లెనిన్ చిత్రం నుంచి డేట్స్ అడ్జెస్ట్ చెయ్యని కారణంగా తప్పుకోవడం చూసి శ్రీలీల బాలీవుడ్ అవకాశాలు రావడంతోనే లెనిన్ వదులుకుంది అనుకున్నారు. ఆ విషయమై టాలీవుడ్ లో పెద్ద చర్చే నడించింది.
అయితే శ్రీలీల కేవలం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసమే లెనిన్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ లో కొద్దిరోజులు నటించాక సినిమా షూటింగ్ ని పవన్ కారణంగా దర్శకుడు హరీష్ శంకర్ పక్కనపెట్టారు. ఇప్పుడు పవన్ రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు కావడంతో శ్రీలీల ఉస్తాద్ కి బల్క్ డేట్స్ ఇచ్చింది.
ఉస్తాద్ ఒప్పుకుని కొంతమేర షూటింగ్ కూడా చేసిన శ్రీలీల ఇప్పుడు ఉస్తాద్ లో లాక్ కావడంతోనే ఆమె చేసేది లేక రీసెంట్ గానే మొదలైన లెనిన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అని తెలుస్తుంది. కేవలం ఉస్తాద్ భగత్ సింగ్-లెనిన్ రెండు చిత్రాల షూటింగ్ డేట్స్ ఒకేసారి పడడంతోనే శ్రీలీల ఇలాంటి టిపికల్ డెసిషన్ తీసుకుంది అంటున్నారు.
అది చూసాక అయ్యో శ్రీలీల ను ఎంత అపార్ధం చేసుకున్నాం, ఆమె లెనిన్ వదులుకునేందుకు ఇంతలా సఫర్ అయ్యిందా అంటూ ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
Sreeleela exits Akhil Akkineni Lenin citing date conflicts








































