ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Swetcha Suicide: Poornachander Surrenders

స్వేచ్ఛ సూసైడ్: లొంగిపోయిన పూర్ణచందర్

Swetcha Suicide: Poornachander Surrenders

గతంలో టీవీ 9 యాంకర్ గా పని చేసిన జర్నలిస్ట్ స్వేచ్ఛ ప్రస్తుతం వేరే ఛానల్ లో పని చేస్తూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో మొదటి నుంచి ప్రముఖంగా వినిపించిన పేరు పూర్ణచందర్ రావు. పూర్ణచందర్ రావు కు భార్య ఇద్దరు పిల్లలు. భార్య కు విడాకులిచ్చి కొన్నాళ్లుగా పూర్ణచందర్ రావు స్వేచ్ఛ తో సహజీవనం చేసారు. 

స్వేచ్ఛ పూర్ణ చందర్ రావు ని వివాహం చేసుకోమని అడిగినా అతను పెళ్ళిని వాయిదా వేస్తూ మాయమాటలు చెప్పడంతో డిప్రెషన్ లోకి  వెళ్లి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా అనుకున్నారు. స్వేచ్ఛ ఆత్మహత్య కు ముందు తన తండ్రితో కూడా పూర్ణ చందర్ రావు గురించి మాట్లాడినట్లుగా చెప్పారు. స్వేచ్ఛ ఆత్మహత్య తర్వాత పూర్ణచందర్ రావు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అంతేకాదు తనమీదకి రాకుండా స్వేచ్ఛ మరణం తర్వాత ఓ లేఖను పూర్ణచందర్ రావు విడుదల చేసాడు. 

ఆమె మృతికి ఆమె మానసిక పరిస్థితి, ఆమె తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణం.. అంటూ అతను రాసిన లేఖలో నిందలు వేసాడు. అయితే జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణ పై ఫిర్యాదు చేసిన స్వేచ్ఛ తల్లిదండ్రులు. ఈలోపే హైడ్రామా మధ్య నిన్న రాత్రి 11 గంటల సమయంలో లాయర్ తో కలిసివచ్చి పోలీసుల ఎదుట పూర్ణచందర్ రావు లొంగిపోయాడు. ఈరోజు ఆదివారం కాబట్టి పూర్ణ ను విచారించి రేపు అరెస్ట్ చేసే రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. 

Anchor Swetcha Death: Parents file police complaint over accused Purnachander absconding

swetcha