డిజాస్టర్ హీరోయిన్ కి రెడ్ కార్పెట్

Red carpet for disaster heroineRed carpet for disaster heroine

హీరోలకు డిజాస్టర్ పడిన వెంటనే బ్యాక్ బౌన్స్ అయ్యి కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టుకుంటారు అని ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పినట్టుగా.. హీరోయిన్స్ కి డిజాస్టర్ పడితే మాత్రం స్టార్ హీరోల నుంచి అవకాశాలు పొందాలంటే మాత్రం చాలా కష్టపడాలి. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సినిమానే డిజాస్టర్ అయినా.. ఆమెకు టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరుస్తుంది అంటే అది కేవలం ఆ హీరోయిన్ లక్ అనే చెప్పాలి. 

గతంలో పెళ్లి సందD చిత్రంతో ప్లాప్ అందుకున్న హీరోయిన్ శ్రీలీల కు వరస అవకాశాలు ఇచ్చారు టాలీవుడ్ యంగ్ హీరోలు. ఇప్పడు అదే కోవలో మిస్టర్ బచ్చన్ లాంటి బిగ్ డిజాస్టర్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే కి టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరవడమే కాదు చాలామంది యంగ్ హీరోలు భాగ్యశ్రీ బోర్సే నామ జపం చేస్తున్నారు. 

మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ తర్వాత ఆమె నటిస్తున్న కింగ్ డమ్ కానీ, ఆంధ్ర తాలూకా కింగ్ కానీ, కాంతా విడుదల కాకుండానే అమ్మడుకి పొలోమంటూ అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పుడు శ్రీలీల చెయ్యాల్సిన లెనిన్ కూడా భాగ్యశ్రీ బోర్సే చెంతకు చేరింది. మరోపక్క ప్రభాస్ తోనూ భాగ్యశ్రీ బోర్సే కి నటించే అవకాశం ఉంది అనే టాక్ ఉంది. 

మరి ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకుండానే అందరూ భాగ్యశ్రీ బోర్సేని కోరుకుంటున్నారు అంటే ఆమె లక్ గురించి ప్రత్యేకంగా డిస్కర్స్ చెయ్యాల్సిందే. 

Tollywood red carpet for Bhagyashri Borse

bhagyashri borse