కన్నప్ప కోసం వెయిట్ చెయ్యాల్సిందే

We have to wait for KannappaWe have to wait for Kannappa

మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ కి ముందు ఎంత కాన్ఫిడెన్స్ చూపించారో.. సినిమా రిలీజ్ అయ్యాక కన్నప్ప టాక్ చూసి మంచు విష్ణు అదే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు. అంతేకాదు కన్నప్ప ను తొందరపడి ఓటీటీలో రిలీజ్ చేసేది లేదు అంటూ కన్నప్ప విడుదలకు ముందే ఖరాకండిగా తెగేసి చెప్పారు విష్ణు.

నిన్న శుక్రవారం జూన్ 27 న విడుదలైన కన్నప్ప చిత్రానికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. కన్నప్ప ఫస్ట్ హాఫ్ పై విమర్శలొస్తున్నాయి.. సెకండ్ హాఫ్ కన్నప్ప ను నిలబెట్టింది, ప్రభాస్ రుద్రా కేరెక్టర్ కన్నప్ప కు అతి పెద్ద ప్లస్ గా నిలిచింది. దానితో కన్నప్ప చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. 

అయితే కన్నప్పను ఓటీటీలో వీక్షించాలంటే ఓ నాలుగు వారాల్లో, లేదంటే ఎనిమిది వారాలు ఆగితే సరిపోతుంది అనుకుంటున్నారేమో.. కన్నప్ప ను ఓటీటీ లో వీక్షించాలి అంటే ఖచ్చితంగా పది వారాల వరకు ఆగాల్సిందే. కన్నప్పను పది వారాల తర్వాతే ఓటీటీ లో రిలీజ్ చేస్తామని మంచు విష్ణు చెప్పారు. మరి ఈ హిట్ మూవీని ఓటీటీలో చూడాలంటే రెండు నెలలు ఆగాల్సిందే. 

Kannappa OTT release details

kannappa