పింక్ డ్రెస్ లో అలియా క్యూట్ లుక్
Alia Bhatt looks cute in a pink dressబాలీవుడ్ చిన్నది అలియా భట్ క్యూట్ గా స్వీట్ గా ఉంటుంది. కుమార్తె రాహా పుట్టిన తర్వాత మరింత అందంగా, ఫిట్ గా తయారైన అలియా భట్ సోషల్ మీడియాలో వదిలే గ్లామర్ ఫొటోస్ కి ఆమె అభిమానులే కాదు యూత్ మొత్తం ఫిదా కావాల్సిందే.
తాజాగా బాలీవుడ్ లో ఓ ఈవెంట్ కి వెళ్లిన అలియా భట్ బేబీ పింక్ కాస్ట్యూమ్ లో ఎంత క్యూట్ గా బ్యూటిఫుల్ గా కనిపించింది అనేది పై పిక్స్ చూస్తే తెలుస్తుంది. లూజ్ హెయిర్, చేతిలో రెడ్ రోజ్ తో అలియా భట్ లేటెస్ట్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
సౌత్ లో ఆర్.ఆర్.ఆర్ తరవాత మరో సౌత్ మూవీకి ఓకే చెప్పని అలియా భట్ అక్కడ బాలీవుడ్ లో మాత్రం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. స్టార్ హీరోల సినిమాలే కాదు హీరోయిన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అలియా భట్. అందుకే ఆమెకు అంత క్రేజ్ మరి.
Alia Bhatt latest pics goes viral
alia bhatt








































