ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

Prabhas fans are very happyPrabhas fans are very happy

కన్నప్ప చిత్రం విషయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ పడిన టెన్షన్ మామూలుది కాదు. కన్నప్ప ను మంచు విష్ణు ఎలా తెరకెక్కిస్తా రు, గెస్ట్ రోల్ అంటూ ప్రభాస్ ఇమేజ్ ని డ్యామేజ్ చెయ్యరు కదా, అసలు కన్నప్పలో ప్రభాస్ ఎందుకు క్యామియో చేస్తాను అని ఒప్పుకున్నారు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడని రోజు లేదు. ఏ హీరో సినిమా అయినా వారికంత టెన్షన్ ఉండేది కాదు. కొన్నాళ్లుగా సక్సెస్ కి దూరమైన మంచు వారి సినిమా కావడంతోనే వారు టెన్షన్ పడ్డారు. 

కానీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు. కారణం కన్నప్ప లో ప్రభాస్ కేరెక్టర్ కి ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ప్రభాస్ రుద్ర గా ఎంట్రీ సీన్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు కన్నప్ప చిత్రం అద్భుతం అంటూ మాట్లాడుకోవడం ప్రభాస్ అభిమానులను ఫుల్ గా సాటిస్పై చేసింది. 

కన్నప్ప మెయిన్ హైలెట్స్ లో రుద్ర కేరెక్టర్ చేసిన ప్రభాస్ ది కావడం అభిమానులను మరింత హ్యాపీ చేసింది. కన్నప్పలోని ఫస్ట్ హాఫ్ వీక్ అయినా అది సెకండ్ హాఫ్ లో రుద్రా క్యారెక్టర్, క్లైమాక్స్ ద్వారా కవరైపోయాయని ఆడియన్స్ మాట్లాడుకోవడమే ప్రభాస్ అభిమానుల ఆనందానికి కారణం. 

కన్నప్ప లో ప్రభాస్ కేరెక్టర్ ఎలివేట్ అవడం, అది ఆడియన్స్ కనెక్ట్ అవడంతో కన్నప్ప లోని మిగతా విషయాలను ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. చూద్దాం ప్రభాస్ స్టామినా కన్నప్పకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో అనేది. 

Prabhas fans are very happy on Kannappa result

prabhas