అన్న విష్ణు సినిమాకు మంచు మనోజ్ రివ్యూ

Manchu Manoj Review about KannappaManchu Manoj Review about Kannappa

అన్న మంచు విష్ణు తో పదే పదే విభేదిస్తున్న మంచు మనోజ్.. ఈరోజు విడుదలైన కన్నప్ప చిత్రాన్ని వీక్షించేందుకు తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని ఐమాక్స్ థియేటర్స్ రావడం అందరిని షాక్ కి గురి చేసింది. అన్న మంచు విష్ణు పై ఇంతెత్తున ఎగిరిపడే మనోజ్ కన్నప్ప ను వీక్షించాడు అంటే ఎవ్వరికి నమ్మబుద్ది కాకపోయినా.. తండ్రి మోహన్ బాబు కోసం మనోజ్ కన్నప్ప సినిమాకి వెళ్లాడని అనుకున్నారు. 

కానీ కన్నప్ప చిత్రం పూర్తయ్యాకా మంచు మనోజ్ ని కన్నప్ప ఎలా ఉంది, మీ అన్న ఎలా నటించాడు అని మీడియా అడగగానే.. మంచు మనోజ్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. కన్నప్ప సినిమా చాలా బాగుంది, ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరో లెవెల్‌కు వెళుతుంది. చివ‌రి 20 నిమిషాలు అదిరిపోయింది. క్లైమాక్స్‌లో నటీనటులు ఇంత గొప్పగా నటిస్తారని కలలో కూడా ఊహించలేదు. 

కన్నప్ప లో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. ప్ర‌భాస్ యాక్టింగ్ అదిరింది. అన్న కూడా ఇంత బాగా చేస్తార‌ని అస్స‌లు అనుకోలేదు. కన్నప్ప ఘ‌న విజ‌యాన్ని సాధించాలని ప్రార్థిస్తున్నా అంటూ మంచు మనోజ్ అన్న మంచు విష్ణు కన్నప్ప పై షాకింగ్ గా రియాక్ట్ అవడం హైలెట్ అయ్యింది. 

Manchu Manoj Honest Review On Kannappa

manchu manoj