BB9 : ఈసారి చదరంగం కాదు రణరంగం

Bigg Boss 9 Telugu Promo ReleasedBigg Boss 9 Telugu Promo Released

బిగ్ బాస్ సీజన్ 9 అప్ డేట్ వచ్చేసింది. ఎవ్వరి మాట వినడు సీతయ్య అన్నట్టుగా ఏ విమర్శలను, ఎలాంటి ట్రోల్స్ ని పట్టించుకోకుండా నాగార్జున హోస్ట్ గా ఈ సీజన్ కి వచ్చేసారు, బిగ్ బాస్ సీజన్ 9 నుంచి బిగ్ అప్ డేట్ గా ప్రోమో వదిలింది యాజమాన్యం. క్రేజీగా నాగార్జున హోస్ట్ ప్లేస్ లో ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ క్రేజీగా దర్శనమిచ్చారు. 

బిగ్ బాస్ సీజన్స్ స్టార్ట్ అయ్యేటపుడే అందరిలో క్రేజ్ పెంచేందుకు వదిలే ప్రోమోస్ మాదిరిగానే సీజన్ 9 ప్రోమో కూడా కనిపించింది. మరి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఆడే ఆటలకన్నా వారి మధ్యన జరిగే పోట్లాటలు హైలెట్ అవుతున్నాయి. అందుకే ఈసారి యాజమాన్యం డైరెక్ట్ గానే చదరంగం కాదు రణరంగం అంటూ ప్రోమో తోనే క్లారిటీ ఇచ్చింది. 

దానిని నాగార్జున స్టైలిష్ లుక్ లో కనిపించి ప్రోమోలో వినిపించారు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ ఈమధ్యన కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఎంతమంది సీజన్ 9 హౌస్ లోకి ఎంటర్ అవుతారో చూడాలి. 

Crazy update on Bigg Boss 9 Telugu

bigg boss 9