ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Priyanka Chopra clarifies on virgin wife comment

వ‌ర్జినిటీపై స్టార్ హీరోయిన్ దుమారం

Priyanka Chopra clarifies on virgin wife comment

ప్రియాంక చోప్రా జోనాస్.. ఈ పేరు వింటే చాలు ప్ర‌పంచం మైమ‌రిచిపోతుంది. అమెరిక‌న్ గాయ‌కుడు నిక్ జోనాస్ ని ప్రియాంక పెళ్లాడాక‌, హాలీవుడ్ లోను వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. హాలీవుడ్ లో నిక్ జోనాస్ కంటే ప్రియాంక చోప్రాకే క్రేజు ఎక్కువ‌. త‌న‌కు క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవాలంటే ఇదిగో ఈ వీడియో వీక్షించి తీరాల్సిందే.

పీసీ న‌టించిన `హెడ్స్ ఆఫ్ స్టేట్` విడుద‌ల‌కు వ‌స్తుంటే, ప్ర‌మోష‌న్స్ లో పీసీ అందంగా న‌డిచొస్తుంటే, జ‌నం కేరింత‌లు పెట్టారు. త‌న ఆటోగ్రాఫ్స్ కోసం మీది మీదికొచ్చారు. పీసీ అలా రాకుమారిలా న‌డిచొస్తూ, అంద‌రికీ అభివాదం చేసి, వారికి ఆటోగ్రాఫ్ లు ఇస్తూ అందంగా న‌వ్వుతూ వేదిక వ‌ద్ క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది.

మ‌రోవైపు వ‌ర్జినిటీపై ప్రియాంక చోప్రా కామెంట్ చేసిందంటూ ఒక క‌థ‌నం వెబ్ లో వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ ప్రియాంక చోప్రా ఏమని కామెంట్ చేసింది .. అంటే? ``కన్యను భార్యగా వెతకొద్దు... మంచి మర్యాద ఉన్న స్త్రీని  పొందండి. కన్యత్వం ఒక రాత్రిలో ముగుస్తుందేమో కానీ మర్యాదలు ప‌ర్మినెంట్‌`` అని వ్యాఖ్య‌ను జోడించిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. అయితే అలాంటి వ్యాఖ్య‌లు తాను చేయ‌లేద‌ని, త‌న‌ది కాని ఖాతాలో ఇలాంటివి వ‌స్తే న‌మ్మొద్ద‌ని, జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పీసీ సూచించింది. ప్రియాంక చోప్రా న‌టించిన హెడ్స్ ఆఫ్ స్టేట్ వ‌చ్చే నెల 2న విడుద‌ల కానుంది. ఈ సోమ‌వారం నాడు న్యూయార్క్ లో ప్రీమియర్‌కు పీసీ హాజరైన‌ప్ప‌టి ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. 

Did Priyanka Chopra make controversial virgin wife comment

priyanka chopra