అన్న సినిమా-తమ్ముడు ప్రమోషన్

Anna movie-Thammudu promotion

మంచు విష్ణు సోదరుల మధ్యన అగ్గిపుల్ల వేస్తె పచ్చగడ్డి కూడా భగ్గుమనేలాంటి గొడవలు ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయంలో మంచు విష్ణు ఇంకా మంచు మనోజ్ లు వ్యవహారం కొట్టుకునే వరకు వెళ్లడమే కాదు, మంచు విష్ణు పై ప్రొఫెషనల్ గా మనోజ్ ఛాలెంజ్ చేసాడు. భైరవంతో కమ్ బ్యాక్ అయిన మంచు మనోజ్ మిరాయ్ అనే పాన్ ఇండియా ఫిలిం లో విలన్ గా నటిస్తున్నాడు. 

ఇక మంచు విష్ణు, మోహన్ బాబు, విష్ణు పిల్లలు నటించిన కన్నప్ప జూన్ 27 న పాన్ ఇండియా ఫిలిం గా విడుదలైంది. కన్నప్ప చిత్రం విడుదలకు ముందు మంచు మనోజ్ అన్న పేరు ఎక్కడా ప్రస్తావించకుండా తండ్రి మోహన్ బాబు దగ్గరనుంచి, అన్న పిల్లల వరకు అందరికి విషెస్ చెప్పాడు. 

అయితే అన్న మంచు విష్ణు కన్నప్ప సినిమా ఇంటర్వెల్ లో మంచు మనోజ్ నటిస్తున్న మిరాయ్ టీజర్ వెయ్యడం అందరిని ఆశ్చర్యపరిచింది. కన్నప్ప ఇంటర్వెల్ లో మిరాయ్ టీజర్ చూసిన వారంతా మంచు విష్ణు కన్నప్ప సినిమా థియేటర్స్ లో మంచు మనోజ్ మిరాయ్ ప్రమోషన్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Mirai teaser in Kannappa movie interval

kannappa