కన్నప్ రిలీజ్ ముంగిట-విష్ణుపై GST రైడ్స్
GST officials raid Manchu Vishnu officesమంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం ఈ శుక్రవారం అంటే జూన్ 27 న రిలీజ్ కి సిద్దయింది. మరొక్క రోజులో కన్నప్ప రిలీజ్ ఉంది అన్న సమయంలో మంచు విష్ణు కార్యాలయాలపై ఏకకాలంలో రెండు ప్రత్యేక బృందాలు GST సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది. కన్నప్ప సినిమాకు సంబంధించిన జీఎస్టీ చెల్లింపుల విషయంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని మాదాపూర్, కావూరి హిల్స్‌లో ఉన్న మంచు విష్ణు కార్యాలయాలపై ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. కన్నప్ప కు సంబందించిన ఆర్ధిక కార్యకలాపాల విషయంలో అధికారులు ఆరాలు తీస్తున్నట్లుగా తెలుస్తుంది. దాడులు నిర్వహిస్తున్న సమయంలో మంచు మోహన్ బాబు మంచు విష్ణు ఆఫీస్ కి చేరుకున్నారు.
ఐటి దాడులపై మంచు విష్ణుని మీడియా ప్రశ్నించగా.. నాకు తెలియదు, మీరు చెబితేనే తెలిసింది, అయినా ఈ దాడులు వలన ఏమి జరుగుతుంది, కన్నప్ప కోసం ఎక్కడెక్కడ అప్పులు చేశామో ఈ తనిఖీల ద్వారా అందరికి తెలుస్తుంది.. అంటూ మంచు విష్ణు లైట్ తీసుకున్నారు.
GST Officials Raid On Vishnu Manchu Kannappa Movie Unit







































