సమంత ఫాన్స్ కు గుడ్ న్యూస్
Good news for Samantha fansకొద్దిరోజులుగా సమంత నటిస్తున్న హిందీ వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ ఆగిపోయింది, ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్ వలన రక్త్ బ్రహ్మాండ్ ను మేకర్స్ ఆపేశారనే మాట వినిపించడం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డబ్బు దొబ్బేసాడు అందుకే సిరీస్ ఆగిపోయింది అనడం ఈ మధ్యలో అంటే కొన్ని నెలలుగా అసలు రక్త్ బ్రహ్మాండ్ వార్తలు వినిపించకపోవడంతో అందరూ... రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ ఆగిపోయింది అని ఫిక్స్ అవడము, మళ్లీ గత రెండు రోజులుగా రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ ఆగిపోయింది అనే వార్త స్ప్రెడ్ అయ్యింది.
అసలే సినిమాలకు బ్రేకిచ్చిన సమంత ఎలాగో సిరీస్ లో అయినా నటిస్తుంది అని ఊరట పడుతున్న సమంత అభిమానులు రక్త్ బ్రహ్మాండ్ ఆగిపోయింది అనే వార్తలపై వారు ఆందోళనపడ్డారు. తాజాగా రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ ఆగిపోయింది అనే వార్తలపై మేకర్స్ రియాక్ట్ అయ్యారు. అన్ని షెడ్యూల్స్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్నాం.
ఇప్పటికే ఇండోర్ టాకీ షెడ్యూల్ దాదాపుగా పూర్తయ్యింది. తర్వాత భారీ అవుట్ డోర్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నాం.. దానికి అనుకూలమైన సమయం అంటే వర్షాలు పడే సమయంలో, అలాగే పచ్చదనం కూడా కావాల్సింది ఉంది, అందుకే కాస్త వెయిట్ చేసి షూటింగ్ చిత్రీకరణ చెయ్యాలని వెయిట్ చేస్తున్నాం అంటూ రక్త్ బ్రహ్మాండ్ రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Samantha Rakt Brahmand: Good news for fans






































