ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pooja Hegde tough time continues Rashmika raises

పూజ హెగ్డే డౌన్-రష్మిక రైజింగ్

Pooja Hegde tough time continues Rashmika raises

పూజ హెగ్డే, రష్మిక మందన్నలు దాదాపుగా హీరోయిన్స్ గా ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. అందులోను టాలీవుడ్ లో రష్మిక-పూజ హెగ్డే కి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడేవారు. కాకపోతే పూజ హెగ్డే కి ఎక్కువగా స్టార్ హీరోల ఛాన్స్ లు వచ్చాయి. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా ప్రతి ఒక్క స్టార్ హీరోతో పూజ హెగ్డే స్క్రీన్ షేర్ చేసుకుంది.

రశ్మికకి మహేష్, అల్లు అర్జున్ తప్ప తెలుగు హీరోలు పెద్దగా అవకాస్లు ఇవ్వలేదు. కానీ రష్మిక హిందీలో క్రేజీ హీరోయిన్ గా మారింది. అదే సమయంలో పూజ హెగ్డే కి వరస ప్లాప్ లు ఆమెను డౌన్ ఫాల్ అయ్యేలా చేసాయి. హిందీ, తెలుగు, తమిళం మూడు భాషల్లోనూ పూజ హెగ్డే కు నిరాశ పరిచే ఫలితాలే వచ్చాయి.

అటు చూస్తే రష్మిక మందన్న, తెలుగు, హిందీ.. ఇప్పుడు తమిళ హీరోతో కలిసి పాన్ ఇండియా హిట్స్ కొడుతోంది. మధ్యలో ఒకటి అర రశ్మికను ఇబ్బంది పెట్టినా.. మళ్ళి ఫామ్ లోకి వచ్చేస్తుంది. ఈ ఏడాది ఛావా తో హిందీలో అద్దిరిపోయె హిట్ కొట్టిన రశ్మికకు సికందర్ దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది.

అయితేనేమి కుబేరతో కుదురుకుంది. కుబేర పాన్ ఇండియా మార్కెట్ లో హిట్ అవడమే కాదు రష్మిక పెరఫార్మెన్స్ కు ప్రత్యేక ప్రశంశలు రావడంతో ఆమె తడిచిముద్దవుతుంది.

ఒకేసారి హీరోయిన్స్ గా ఎంటర్ అయిన పూజ హెగ్డే ప్రస్తుతం డౌన్ లో ఉండగా.. రష్మిక హ్యాండ్ రైజింగ్ లో ఉంది. రష్మిక కు గ్లామర్, లక్కు, పెరఫార్మెన్సు పరంగా మంచి పాత్రలు రావడం అన్ని అలా అలా కలిసొస్తున్నాయి. 

Pooja Hegde vs Rashmika

pooja hegde vs rashmika raises