Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Case booked against actor Vijay Deverakonda

విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు నమోదు

Case booked against actor Vijay Deverakonda

హీరో విజయ్ దేవరకొండ పై అట్రాసిటీ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఆయన గతంలో రెట్రో ప్రీరిలీజ్ వేడుకల్లో చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రెట్రో ఈవెంట్ లో పహల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ టెర్రరిస్టులను ట్రైబల్స్ గా పోల్చి విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఆదివాసీలను అవమానించేలా ఉన్నాయి అంటూ మండిపడుతున్నారు. 

విజయ్ దేవరకొండ వ్యాఖ్యలకు వ్యతిరేఖంగా ఆదివాసులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడమే కాదు విజయ్ దేవరకొండ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానితో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

అంతేకాకుండా విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై విచారణ జరిపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

Vijay Deverakonda booked under SC/ST Act

vijay deverakonda