Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> SSMB29 - Sensational entry of Mahesh Babu

SSMB 29: మహేష్ ఎంట్రీ సీన్ పై క్రేజీ న్యూస్

SSMB29 - Sensational entry of Mahesh Babu

దర్శకధీరుడు రాజమౌళి హీరోలను ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తారో ఆయా హీరోల అభిమానులకే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా తెలుసు. అభిమానుల కోసం హీరోలకు ఎలివేషన్ ఇవ్వడం, మాస్ ఆడియన్స్ కోసం అనవసరంగా యాక్షన్ సీన్స్ పెట్టడం వంటివి ఉండవు. అభిమానులతో పాటుగా సాధారణ ప్రేక్షకుడు కూడా నచ్చేలా రాజమౌళి సినిమాలు ఉంటాయి. 

ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నారు. #SSMB 29 షూటింగ్ చిత్రీకరణలో రాజమౌళి బిజీగా వున్నారు. ఇంతవరకు అఫీషియల్ అప్ డేట్ ఇవ్వకపోయినా.. #SSMB 29 పై ఎలాంటి న్యూస్ వినిపించినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా రైటర్ విజయేంద్ర ప్రసాద్.. నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద ఫ్యాన్స్. ఆయన పుస్తకాల ఆధారంగానే SSMB 29 సినిమా స్క్రిప్ట్ ను రాశాను అంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అయితే  #SSMB 29 లో మహేష్ ఎంట్రీ పై ఓ పవర్ ఫుల్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆఫ్రికా లోని కెన్యాలోని ఓ భారీ అటవీ పార్క్ లో వచ్చే షెడ్యూల్ లో హీరో ఎంట్రీ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సీక్వెన్స్ కోసం మహేష్ తో పాటు ప్రియాంక చోప్రా కూడా షూట్ లో పాల్గొననుంది అని తెలుస్తుంది. వీరిద్దరి పాత్రల పరిచయాలతో పాటు కథ తాలూకు గమనాన్ని కూడా ఈ సీక్వెన్స్ లో రివీల్ చేస్తారని తెలుస్తోంది. మరి ఇలాంటి న్యూస్ లు వింటే మహేష్ ఫ్యాన్స్ గూస్ బంప్స్ రావడం ఖాయం. 

Mahesh Babu breathtaking entry in SSMB29

mahesh