Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pawan Kalyan hot comments on Bollywood failure

బాలీవుడ్ ఫెయిల్యూర్ పై పవన్ హాట్ కామెంట్స్

Pawan Kalyan hot comments on Bollywood failure

సౌత్ సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ డామినేషన్ తో బాలీవుడ్ బాక్సాఫీసు చిన్నాభిన్నమైంది. అసలు బాలీవుడ్ లో ఎప్పుడో ఒక హిట్టు తప్ప అన్ని నిరాశ పరిచే సినిమాలే రావడంతో హిందీ మార్కెట్ మొత్తం పడిపోయింది. భారీ బడ్జెట్ చిత్రాలు సైతం నిరాశపరుస్తున్నాయి. అక్కడి నటులు, దర్శకనిర్మాతలు, ప్రేక్షకులు కూడా బాలీవుడ్ ఫెయిల్యూర్స్ పై కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 

తాజాగా హీరో పవన్ కళ్యాణ్ బాలీవుడ్ ఫెయిల్యూర్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. బాలీవుడ్ లో నేటివిటీ మిస్ అవడం వలనే సక్సెస్ లు రావడం లేదు. గతంలో ఆమిర్ ఖాన్ తెరకెక్కించిన దంగల్ చిత్రం భారతీయ సంస్కృతిని అద్దం పట్టింది, ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. బాలీవుడ్ లో ఇండియా నేటివిటీ తగ్గి వెస్ట్రన్ కల్చర్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడే ప్రేక్షకాదరణ తగ్గింది అంటూ పవన్ కామెంట్స్ చేసారు. 

బాలీవుడ్ లో డబ్బు కి ప్రాధాన్యత పెరిగింది, అదే సమయంలో సౌత్ లో తెరకెక్కుతున్న చిత్రాలన్నీ నేటివిటీకి దగ్గరగా రూరల్ కల్చర్ కి ఇస్తున్న ప్రాధాన్యత వలనే సౌత్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ సౌత్ సక్సెస్-బాలీవుడ్ ఫెయిల్యూర్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Pawan Kalyan

pawan kalyan