కన్నప్పలో ప్రభాస్ ఎంట్రీ అలా ఉంటుంది
BVS Ravi Goosebumps Words About Prabhas Entry In Kannappaకన్నప్ప చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నారు. ఆవిషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఉన్నారు. రుద్ర గా ప్రభాస్ పవర్ ఫుల్ రోల్ కన్నప్ప లో ప్లే చేస్తున్నారని కన్నప్ప ట్రైలర్ కట్ తోనే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రభాస్ కన్నప్ప లో ఎంత సేపు కనిపిస్తారు, ఎక్కడ ఎంట్రీ ఇస్తారనే విషయంపైన అందరిలో చాలా క్యూరియాసిటీ ఉంది.
అయితే మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్స్ లోనే ప్రభాస్ పాత్ర నిడివి దాదాపుగా అరగంట పైనే ఉంటుంది అని చెప్పారు. తాజాగా కన్నప్ప ఈవెంట్ లో రైటర్ బీవీఎస్ రవి.. ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ పాత్ర కన్నప్ప సెకండ్ హాఫ్ లో ఎంటర్ అవుతుంది, ఇంటర్వెల్ తర్వాత సరిగ్గా 15వ నిమిషంలో ప్రభాస్ పాత్ర సినిమాలోకి ప్రవేశిస్తుందని… అక్కడ్నుంచి సినిమా వేరే లెవల్ అంటూ రవి ప్రభాస్ పాత్ర పై బిగ్ ఎలివేషన్ ఇచ్చాడు.
అంతేకాదు 27 నిమిషాల పాటు ప్రభాస్, మంచు విష్ణు మధ్య వచ్చే సన్నివేశాలు కన్నప్ప కే హైలెట్ గా నిలవబోతున్నాయని, మొత్తంగా సెకండ్ హాఫ్ అదిరిపోతుందని ప్రభాస్ రుద్ర పాత్ర నిడివి అలాగే ప్రభాస్ కేరెక్టర్ పై కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బీవీఎస్ రవి హైప్ క్రియేట్ చేసాడు.
BVS Ravi Superb Speech at Kannappa Movie Pre Release Event







































